Share News

AP Elections Results: ఏపీ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?

ABN , Publish Date - Jun 04 , 2024 | 10:19 PM

మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఏపీ ఎన్నికల కౌంటింగ్‌పై ఫైనల్‌గా ఫుల్ పిక్చర్ వచ్చేసింది. ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలిచాయో లెక్క తేలింది. 175 అసెంబ్లీ సీట్లకు...

AP Elections Results: ఏపీ ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?
AP Assembly Elections 2024 Final Results

మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఏపీ ఎన్నికల కౌంటింగ్‌పై (AP Election Results 2024) ఫైనల్‌గా ఫుల్ పిక్చర్ వచ్చేసింది. ఏయే పార్టీ ఎన్ని సీట్లు గెలిచాయో లెక్క తేలింది. 175 అసెంబ్లీ సీట్లకు గాను ఎన్డీఏ కూటమి (NDA) 164 సీట్లతో అఖండ విజయాన్ని నమోదు చేసింది. వైసీపీ (YSRCP) కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఎన్డీఏ కూటమిలోని పార్టీలను చూసుకుంటే.. టీడీపీ (TDP) మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయగా 135 స్థానాల్లో నెగ్గింది. జనసేన (Janasena) 21కి 21 స్థానాలు సొంతం చేసుకుని 100% విజయాన్ని సాధించింది. ఇక బీజేపీ (BJP) మొత్తం 10 చోట్ల పోటీ చేయగా.. 8 సీట్లలో గెలుపొందింది.

మొదట్లో వైసీపీ 10 స్థానాలకే పరిమితం అవుతుందని అనుకున్నారు కానీ.. చివర్లో ఆ పార్టీ మరో స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రకాశం జిల్లా దర్శి స్థానం ఫలితంపై చివరి వరకూ ఉత్కంఠ కొనసాగింది. తొలి రౌండ్‌లలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆధిక్యంలో కొనసాగారు. కానీ.. చివరి రౌండ్‌లకు వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ ఆధిక్యంలో వచ్చారు. చివరికి ఆయన 2,597 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో.. వైసీపీ సంఖ్య 11కి చేరింది. ఏపీ చరిత్రలో ఇంత ఘోర ఓటమి నమోదు కావడం ఇదే మొదటిసారి. గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లతో ఓటమిపాలవ్వగా.. ఈసారి వైసీపీ (11 సీట్లు) అంతకంటే అవమానకరమైన పరాజయాన్ని చవిచూసింది.


ఎన్నికల ఫలితాలు

ఎన్డీఏ(టీడీపీ+): 164

టీడీపీ: 135

జనసేన: 21

బీజేపీ: 8

వైసీపీ: 11

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - Jun 04 , 2024 | 10:19 PM