Share News

Jagan: ఓటమిపై జగన్ విశ్లేషణ.. పలు కీలక అంశాలపై చర్చ

ABN , Publish Date - Jun 06 , 2024 | 10:08 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరా ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) నేడు(గురువారం) ఆ పార్టీకి చెందిన కీలక నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఓటమికి గల కారణాలపై విశ్లేషించుకున్నారు.

Jagan: ఓటమిపై జగన్ విశ్లేషణ.. పలు కీలక అంశాలపై చర్చ

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరా ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) నేడు(గురువారం) ఆ పార్టీకి చెందిన కీలక నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఓటమికి గల కారణాలపై విశ్లేషించుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్యేల వ్యవహార తీరుపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రజలను వైసీపీని దరి చేర్చిన సంక్షేమ పథకాలపై కూడా చర్చించినట్లు సమాచారం.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

అయితే ఈ పథకాల ద్వారా కోట్లాది మందికి లబ్ధి చేకూర్చి, పాలనను గీటురాయిగా మార్చామని నేతలు తెలిపారు. పార్టీ పునర్వైభవం సాధిస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి 40శాతం ఓటింగ్ రావడం వెనుక జగన్ కృషి ఉందని నేతలు చెప్పుకొచ్చారు. ఈవీఎంల వ్యవహారంపై పరిశీలన చేయాలని నేతలు జగన్‌కు సూచించారు. కార్యకర్తలకు అండగా ఉండాలని నేతలకు జగన్ సూచించారు. ఎన్డీఏ కూటమిపై పార్టీ తరపున గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

Updated Date - Jun 06 , 2024 | 10:08 PM