Share News

AP Election Results: అనుకున్నట్లే.. వైసీపీ జెండాను ‘పీకే’శారుగా..!!

ABN , Publish Date - Jun 04 , 2024 | 08:46 PM

అవును.. అనుకున్నట్లే జరిగింది..! ఇద్దరూ ‘పీకే’లు వైసీపీ (YSR Congress) జెండాను పీకి పడేశారు..! ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election Results) ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోయింది..! ఎంతలా అంటే వైనాట్ 175 నుంచి సింగిల్ డిజిట్‌కే పరిమితమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇద్దరు పీకేలను కూటమి పార్టీ శ్రేణులను గుర్తు చేసుకుంటున్నారు...

AP Election Results: అనుకున్నట్లే.. వైసీపీ జెండాను ‘పీకే’శారుగా..!!

అవును.. అనుకున్నట్లే జరిగింది..! ఇద్దరూ ‘పీకే’లు వైసీపీ (YSR Congress) జెండాను పీకి పడేశారు..! ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election Results) ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోయింది..! ఎంతలా అంటే వైనాట్ 175 నుంచి సింగిల్ డిజిట్‌కే పరిమితమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇద్దరు పీకేలను కూటమి పార్టీ శ్రేణులను గుర్తు చేసుకుంటున్నారు. పీకేలు అంటే ఎవరనుకుంటున్నారు.. అదేనబ్బా జనసేన అధినేత పవన్ కల్యాణ్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశో‌ర్..! ఈ ఇద్దరి గురించి ఇప్పుడెందుకు డిస్కషన్..? వైసీపీకి వీరికి ఏంటి సంబంధం..? అనే సందేహాలు వస్తున్నాయ్ కదూ.. అక్కడికి వచ్చేస్తున్నా ఆగండి..!


WhatsApp Image 2024-06-04 at 8.48.05 PM.jpeg

అక్షరాలా నిజమైన పీకే మాటలు!

వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదు.. రాసిపెట్టుకోండి.. సంక్షేమ పథకాలు పార్టీని గెలిపించవు.. నిరుద్యోగులు కసిమీద ఉన్నారు.. అందుకే ఘోర పరాజయం ఎదురుకాబోతోంది అని ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) చాలా ఇంటర్వ్యూల్లో ఇదే మాట చెప్పారు. దీనికి వైసీపీ నుంచి గట్టిగా కౌంటర్లు కూడా వచ్చాయి.. ఆఖరికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా స్పందించిన పరిస్థితి. అయినా సరే ‘తగ్గేదేలే’ అంటూ పీకే మాత్రం మాట మీదే కట్టుబడి ఉన్నాని స్పష్టం చేశారు. దీనిపై మళ్లీ పీకే స్పందించి.. ఎన్నికల ముందు ఏ రాజకీయ నేతా ఓటమిని అంగీకరించరని చెప్పినా కూడా ఈయన్ను ఘోరాతి ఘోరంగా ట్రోల్ చేశారు. మాటల్లో చెప్పలేని, రాయలేనంతగా తిట్లు కూడా తిట్టారు. సీన్ కట్ చేస్తే.. పీకే చెప్పింది అక్షరాలా నిజమైంది.. ఇప్పుడు ఆయన్నే అభినందిస్తున్న పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తయితే పీకే మాట్లాడిన ఈ మాటలను జనాల్లోకి బాగా తీసుకెళ్లారు కూటమి నేతలు, కార్యకర్తలు. దీంతో జనాలు డైలామాలో పడిపోయిన పరిస్థితి. ఇలా వైసీపీని పీకే ఊహించని దెబ్బ కొట్టారు..!


WhatsApp Image 2024-06-04 at 8.48.05 PM (1).jpeg

అథ:పాతాళానికి తొక్కేశాడుగా!

జగన్ గుర్తుపెట్టుకో.. అథ:పాతాళానికి తొక్కకపోతే నాపేరు పవన్ కల్యాణే కాదు.. నా పార్టీ జనసేనే కాదు.. మరిచిపోకు. వైసీపీ వాళ్లకు బాగా తెలుసు.. నెత్తిమీద కాలేసి తొక్కుతామని.. ఎన్నికల తర్వాత మేమేంటి అనేది తెలుస్తుంది అని పదుల సంఖ్యలో బహిరంగ సభావేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చెబుతూ వచ్చారు. అనుకున్నట్లుగానే టీడీపీ అధినేత చంద్రబాబుతో చేతులు కలిపిన తర్వాత పక్కా ప్లాన్‌, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అన్నంత పనిచేసేశారు. చంద్రబాబు-పవన్ జత కట్టడంతోనే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. అందులోనూ.. జనసేన పోటీచేసిన 21కి 21 స్థానాల్లో గెలిచి నిలిస్తే కనీసం ఇందులో సగం కూడా వైసీపీకి రాలేదు.. ఇదీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రేంజ్.. మాట మీద నిలబడటం అని జనసైనికులు చెప్పుకుంటున్నారు. మాట తప్పడు మడమ తిప్పడు అనే వైఎస్ జగన్ డైలాగ్.. ఇప్పుడు అక్షరాలా పవన్‌కు సెట్ అవుతుందని నెట్టింట్లో సేనాని వీరాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చూశారుగా.. ఇద్దరు పీకేలు వైసీపీని ఏ పరిస్థితికి తెచ్చారో.. అదన్న మాట సంగతి.


ఇవి కూడా చదవండి..


ఏపీలో ఏం నడుస్తోంది.. వైసీపీపై ఒక్కటే ట్రోలింగ్.. ఇదిగానీ చూశారో..!!


వైఎస్ జగన్ చెప్పినట్లే.. దేశం మొత్తం ఏపీ వైపు చూసిందిగా!


అంతా దేవుడి స్క్రిప్ట్.. అవును అక్షరాలా నిజమే జగన్!


Updated Date - Jun 04 , 2024 | 08:52 PM