Share News

AP Politics: పరిధి దాటారు.. ప్రజలే బుద్ధి చెప్పారు..

ABN , Publish Date - Jun 05 , 2024 | 01:53 PM

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పనితీరును గమనించిన ఏపీ ప్రజలు విలక్షణమైన తీర్పును ఇచ్చారు. పాలనను గాలికొదిలేసి వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ప్రజలంతా చూశారు. అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును జైల్లో పెట్టి.. ఆయన కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు.

AP Politics: పరిధి దాటారు.. ప్రజలే బుద్ధి చెప్పారు..
Nara Bhuvaneswari

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పనితీరును గమనించిన ఏపీ ప్రజలు విలక్షణమైన తీర్పును ఇచ్చారు. పాలనను గాలికొదిలేసి వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ప్రజలంతా చూశారు. అక్రమ కేసులు బనాయించి చంద్రబాబును జైల్లో పెట్టి.. ఆయన కుటుంబాన్ని తీవ్రంగా వేధించారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా చంద్రబాబు భార్య భువనేశ్వరిని వైసీపీ నేతలు లక్ష్యంగా చేసుకున్నారు. ఏపీ అసెంబ్లీలో భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని అవమానపర్చేలా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎంతో హేళన చేశారు. మరోవైపు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పట్ల అవమానకరరీతిలో వైసీపీ నాయకులు వ్యవహరించారు. వీటన్నింటిని ఏపీ ప్రజలు గమనిస్తూ వచ్చారు. తమకు సమయం వచ్చినప్పుడు సరైన తీర్పు చెప్పాలని నిర్ణయించుకున్న ఓటర్లు ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారు.

AP Election Result 2024: ఇంటిపేరు మార్చుకుంటున్నా: ముద్రగడ సంచలన ప్రకటన


వైసీపీ నాయకులు ఎన్నో అవమానాలకు గురిచేసినా చంద్రబాబు కుటుంబం బెదరలేదు. ఎప్పుడూ రాజకీయాల్లో లేని భువనేశ్వరి సైతం వైసీపీ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలకు అండగా నిలిచారు. ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ టీడీపీ శ్రేణుల్లోనూ, రాష్ట్రప్రజల్లోనూ ధైర్యం నింపేందుకు భువనేశ్వరి తనవంతు ప్రయత్నం చేశారు. అవమానాలను ఎదరించి నిలబడ్డారు. దీంతో ప్రజలు సైతం ఓ మహిళ బాధపడుతుంటే చూడలేకపోయారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా భువనేశ్వరిని రాజకీయాల్లోకి లాగి ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేయడంతో రాష్ట్రప్రజలు తమ ఓటుతో వైసీపీకి గుణపాఠం చెప్పారనే చర్చ జరుగుతోంది.

AP Election Result 2024: కలిసొచ్చిన ‘ఫ్యామిలీ’!


ప్రజల కోసం తొలిసారి..

చంద్రబాబు గతంలో మూడుసార్లు సీఎంగా పనిచేశారు. అయినప్పటికీ ఆయన సతీమణి భువనేశ్వరి ఎప్పుడూ రాజకీయ పదవులను అలంకరించలేదు. రాజకీయ ప్రచారంలోనూ పాల్గొనలేదు. కుటుంబ బాధ్యతలతో పాటు ఎన్టీఆర్ ట్రస్టు బాధ్యతలను చూసుకునేవారు. తొలిసారి భువనేశ్వరి ఈ ఎన్నికల్లో ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడుకు అండగా నిలిచారు. గతంలో పరోక్షంగా అండగా నిలిచిన భార్య భువనేశ్వరి.. ఈసారి నేరుగా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా రాజకీయ ప్రచారంలో పాల్గొన్నారు. భువనేశ్వరి సెంటిమెంట్ సైతం తెలుగుదేశం పార్టీకి కలిసొచ్చిందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ ఘోర పరాజయం.. టీడీపీ ఘన విజయంలో భేవనేశ్వరి పాత్ర ఎనలేనిదని టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు.


Prathipati Pullarao: వైసీపీ ఓటమికి కర్త, కర్మ, క్రియ అన్నీ జగన్ రెడ్డే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Andhra Pradesh and Latest Telugu News

Updated Date - Jun 05 , 2024 | 01:58 PM