Home » AP Election Survey
ఏపీలో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాల్లో గెలవాలనేది ఒక సెంటిమెంట్. ఈ రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెలిచిన పార్టీ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓవైపు పోస్టల్ బ్యాలెట్లతో పాటు మరోవైపు ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు వైసీపీ నేతలు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్‌పోల్స్ వచ్చినప్పటికీ అసలు ఫలితాల కోసం తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే అధికారమని తేల్చేశాయి. ఒకట్రెండు సర్వేలు మాత్రం వైసీపీ మెజార్టీ మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేశాయి.
లోకమంతా ఒకవైపు.. సీఎం జగన్ మరోవైపు అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్‌లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్, రైజ్ తదితర సంస్థలు పేర్కొన్నాయి. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశాయి. ఊరూపేరూ లేని అనామక సంస్థలు వైసీపీయే అధికారంలోనికి వస్తుందంటూ ఇచ్చిన ఫలితాలను జగన్‌కు చెందిన చెందిన నీలి, కూలి మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేసుకుని ప్రభుత్వ పెద్దలు సంతృప్తి చెందుతున్నారు. ఈ సంస్థలూ జగన్ చెప్పినట్లుగా 151 స్థానాలకు మించి వస్తాయని పేర్కొనలేదు
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో వైసీపీకి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్-13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
ఏపీలో గెలుపేవరిదో మరో మూడు రోజుల్లో తేలనుంది. జూన్4వ తేదీన ఓటర్ల తీర్పు వెలువడనుంది. ఈలోపు 7 దశల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్‌ను సర్వే సంస్థలు విడుదల చేశాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేయగా.. వైసీపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి.
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డాయి. ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై వివిధ సర్వే సంస్థలు విభిన్న అంచనాలను వేసింది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖులు పోటీచేసిన నియోజకవర్గాలపై సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) గెలుపెవరిది..? ప్రభుత్వం ఏర్పాటు చేసేది కూటమా..? లేకుంటే వైసీపీనా..? అనేదానిపై తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన, అత్యంత విశ్వసనీయత కలిగిన ఆరా మస్తాన్ తేల్చేశారు. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయ్..? వైసీపీ గెలవబోయే స్థానాలు ఎన్ని..? ఎవరికెన్ని పార్లమెంట్ సీట్లు రాబోతున్నాయ్..? అనేదానిపై క్లియర్ కట్‌గా చెప్పేశారు. ఇంకెందుకు ఆలస్యం ఇదిగో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి లైవ్ క్లిక్ చేసి చూసేయండి..
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆరా సంస్థ తన పోస్ట్‌పోల్ సర్వేను విడుదల చేసింది. ఏపీలో బీజేపీ మూడు లోక్‌సభ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఆరా సర్వేలో తేలిందన్నారు.
ఓ వైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై వరుసగా ఎగ్జిట్‌పోల్స్ వెలువడుతున్నాయి. అదే సమయంలో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఒక్కో సర్వే సంస్థ తమ ఎగ్జిట్‌పోల్స్‌ను విడుదల చేస్తున్నాయి.