AARA Exit Poll: కడపలో షర్మిల ప్రభావం ఎంత.. అవినాష్ ఓట్లను ఏ మేరకు చీల్చారు..?
ABN , Publish Date - Jun 01 , 2024 | 09:10 PM
ఏపీలో గెలుపేవరిదో మరో మూడు రోజుల్లో తేలనుంది. జూన్4వ తేదీన ఓటర్ల తీర్పు వెలువడనుంది. ఈలోపు 7 దశల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్‌ను సర్వే సంస్థలు విడుదల చేశాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేయగా.. వైసీపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి.
ఏపీలో గెలుపేవరిదో మరో మూడు రోజుల్లో తేలనుంది. జూన్4వ తేదీన ఓటర్ల తీర్పు వెలువడనుంది. ఈలోపు 7 దశల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్‌ను సర్వే సంస్థలు విడుదల చేశాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేయగా.. వైసీపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి. కాంగ్రెస్ మాత్రం ఏ నియోజకవర్గంలోనూ పెద్దగా ప్రభావం చూపించలేదని సర్వే సంస్థలు అంచనావేశాయి. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వైసీపీ ఓట్లను భారీగా చీల్చే ప్రయత్నం చేసినా.. ఆమె గెలిచే అవకాశం లేదని ఆరా సంస్థ అంచనావేసింది. 12శాతం ఓట్లు షర్మిలకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆరా అధినేత మస్తాన్ ప్రకటించారు. కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీచేశారు. ఆమెకు మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మద్దతు పలికారు. కడప నుంచి విజయం సాధిస్తానంటూ షర్మిల ధీమా వ్యక్తం చేశారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం షర్మిల గెలిచే అవకాశాలు లేవని తేల్చాయి.
AARA Exit Polls: అనకాపల్లి, నరసాపురంలో గెలుపు వారిదే.. రాజంపేటలో మాత్రం..
కడపలో గెలుపెవరిది..?
కాంగ్రెస్ పార్టీ పోటీచేసిన లోక్‌సభ స్థానాల్లో ఎక్కువ ఓట్లు సాధించే నియోజకవర్గంగా కడప ఉండే అవకాశం ఉందని సర్వే సంస్థలు అంచనావేశాయి. కడపలో వైఎస్ షర్మిలకు డిపాజిట్లు వచ్చే అవకాశం లేదని ఆరా సంస్థ తెలిపింది. షర్మిల విస్తృతంగా కడపలో ప్రచారం చేసినప్పటికీ అనుకున్నంత ప్రభావం చూపించలేదని తెలిపింది. గతంతో పోలిస్తే వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి మెజార్టీ తగ్గే అవకాశం ఉందని.. ఆ ఓట్లను షర్మిల చీల్చడంతోనే మెజార్టీ తగ్గే అవకాశం ఉందని ఆరా సంస్థ అంచనా వేసింది.
AP Exit Polls 2024: ఏపీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్.. ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News and Telugu News