Share News

AP Election Results: ఎగ్జిట్‌పోల్స్‌తో మారిన రాజకీయ పార్టీల మూడ్.. ఓ పార్టీలో ఉత్సాహం.. మరో పార్టీలో నిరుత్సాహం..

ABN , Publish Date - Jun 02 , 2024 | 09:10 PM

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్‌పోల్స్ వచ్చినప్పటికీ అసలు ఫలితాల కోసం తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే అధికారమని తేల్చేశాయి. ఒకట్రెండు సర్వేలు మాత్రం వైసీపీ మెజార్టీ మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేశాయి.

AP Election Results: ఎగ్జిట్‌పోల్స్‌తో మారిన రాజకీయ పార్టీల మూడ్.. ఓ పార్టీలో ఉత్సాహం.. మరో పార్టీలో నిరుత్సాహం..
TDP, Janasena, BJP and YSRCP

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్‌పోల్స్ వచ్చినప్పటికీ అసలు ఫలితాల కోసం తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే అధికారమని తేల్చేశాయి. ఒకట్రెండు సర్వేలు మాత్రం వైసీపీ మెజార్టీ మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేశాయి. జాతీయ స్థాయిలో పేరొందిన సర్వేలు మాత్రం కూటమికే పట్టం కట్టాయి. కనీసం వందకు పైగా సీట్లతో టీడీపీ కూటమి విజయకేతనం ఎగరవేయబోతున్నట్లు మెజార్టీ సర్వే సంస్థలు అంచనావేశాయి. ఎగ్జిట్‌పోల్స్ తర్వాత రాజకీయ పార్టీల మూడ్ మారినట్లు కనిపిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్ తమకు అనుకూలంగా వస్తాయని భావించిన వైసీపీకి ఎదురుదెబ్బ తగిలిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్‌ పోల్స్ కాదంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వరుసగా రెండోసారి అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ నాయకులు ఎగ్జిట్‌పోల్స్ తర్వాత నోరు మెదపడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్వే సంస్థలు తమ అంచనాలను విడుదల చేసిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో ఉత్సాహం నెలకొంటే.. వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొందట. జాతీయస్థాయి సర్వేలు తమకు అనుకూలంగా లేకపోవడంతో వైసీపీ నాయకులు డీలా పడ్డారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీకి చెందిన ఒకరిద్దరు నేతలు మినహా ఇతర నాయకులు ఎగ్జిట్‌పోల్స్‌ గురించి మాట్లాడటం లేదట.

AP Exit Polls 2024: ఏపీలో గెలిచేదెవరో తేల్చి చెప్పిన ఇండియా టుడే సర్వే


మారిన మూడ్..

ఎగ్జిట్‌పోల్స్ విడుదలతో ఏపీలో రాజకీయ పార్టీల మూడ్ ఒక్కసారిగా మారిపోయింది. సర్వే సంస్థల అంచనాలు కూటమికి అనుకూలంగా ఉండటంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఆనందంతో కనిపిస్తున్నారు. మరోవైపు వైసీపీ నాయకులకు ఎగ్జిట్‌పోల్స్ నిరాశ కలిగించినట్లు తెలుస్తోంది. రియల్‌ రిజల్ట్ తమకు అనుకూలంగా ఉంటుందని.. సర్వే సంస్థల అంచనాలపై తమకు విశ్వాసం లేదంటూ వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు కేంద్రంలో బీజేపీని సంతృప్తిపర్చేందుకు ఎన్డీయే కూటమికి అనుకూలంగా సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో ఎగ్జిట్‌పోల్స్‌ వైసీపీని ఎంత నిరాశకు గురిచేశాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఎగ్జిట్‌పోల్స్ తర్వాత రాజకీయ పార్టీల మూడ్ మారిందనేది స్పష్టమవుతోంది.


వైసీపీ సైలెన్స్..

సర్వే సంస్థల అంచనాలు వెలువడిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నానితో పాటు ఒకరిద్దరు వైసీపీ అధికారప్రతినిధులు మినహా మిగతా నేతలంతా సైలెన్స్ మోడ్‌లో కనిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఎవరు బయటకు వచ్చి ఎగ్జిట్‌పోల్స్‌పై మాట్లాడే సహసం చేయడంలేదట. ఇప్పుడు ఏదైనా అతిగా మాట్లాడితే అసలు ఫలితం తమకు అనుకూలంగా రాకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందనే ఆలోచనతోనే వైసీపీ ముఖ్య నాయకులంతా సైలెంట్ అయిపోయారనే చర్చ సాగుతోంది.


కూటమి నేతల్లో ఉత్సాహం..

ఎగ్జిట్ పోల్స్ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోందట. మెజార్టీ సర్వేలు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తాయని అంచనావేయడంతో రియల్ రిజల్ట్‌ ఇలాగే ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ జూన్4న వచ్చే ఫలితం ఎలా ఉంటుందనేది తీవ్ర ఆసక్తి రేపుతోంది.


AP Elections 2024: కౌంటింగ్ రోజు ఘర్షణలు సృష్టించే అవకాశం: నాందెడ్ల మనోహర్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

For more latest Andhrapradesh news and Telugu news..

Updated Date - Jun 02 , 2024 | 09:12 PM