Home » AP Govt
రైతు సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగునీటి వ్యవస్థకు పునరుజ్జీవం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
తిరుమల లడ్డూ (Tirumal Laddu) వివాదంపై సుప్రీంకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Former Chairman YV Subbareddy), సుబ్రహణ్యస్వామి వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు.
Andhrapradesh: వెంకట్రామిరెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సాధారణ పరిపాలన శాఖ షోకాజ్ నోటీసులు అందజేసింది. ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు రద్దు ఎందుకు చేయకూడదో తెలియచేయాలంటూ జీఏడీ షోకాజ్ నోటీసు ఇచ్చింది. వెంకటరామిరెడ్డి అందుబాటులో లేకపోవటంతో అప్సా తరపున ప్రభుత్వానికి కార్యదర్శి కృష్ణ, ఇతర ఆఫీసుబేరర్లు సమాధానం ఇచ్చారు.
పెద్దాపురం, సెప్టెంబరు 25: ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలని జిల్లా వ్యవసా యాధికారి ఎన్.విజయ్‌కుమార్ కోరారు. మండలంలోని కట్టమూరులో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు తెగుళ్ల పట్ల
సామర్లకోట, సెప్టెంబరు 25: గత వైసీపీ పాల నలో అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనించడం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సా ధ్యపడుతుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పట్టణంలో బుధవారం మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇది
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో 16 మంది ఐపీఎస్(IPS) అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ బదిలీ అయ్యారు. ఎం.రవిప్రకాశ్ పీ అండ్ ఎల్ ఐజీగా బదిలీ అయ్యారు.
తిరుమల లడ్డూ కల్తీకి పాల్పడిన మాజీ సీఎం జగన్‌ను వేంకటేశ్వరస్వామి భక్తులు, ఏపీ ప్రజలు క్షమించరని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. లడ్డూ కల్తీ చేసి అపరాచానికి పాల్పడిన ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Andhrapradesh: విజయవాడ కలెక్టరేట్లో వరద బాధితులకు నష్ట పరిహారాన్ని సీఎం చంద్రబాబు అందజేశారు. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలోని ప్రజలకు ప్రభుత్వం సాయం అందిస్తుంది. నేరుగా వరద బాధితుల ఖాతాల్లోకి నష్టపరిహారం సొమ్మును జమ చేశారు. ఎన్యూమరేషన్ పూర్తి కావడంతో అర్హులైన బాధితులందరికీ వారి ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ కానున్నాయి.
విజయవాడ వరదలకు బ్యాక్టీరియా వల్ల కాలు కోల్పోయిన బాధితుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్ధిక సాయం అందజేసి మరోసారి దాతృత్వం చాటుకున్నారు. రూ. 10 లక్షల ఎల్ఓసీ ఇస్తూ లేఖ విడుదల చేశారు. జగ్గయ్యపేట ఆర్టీసీ కాలనీలో వరదల వల్ల వచ్చిన బాక్టీరియాతో బాధితుడు ఒక కాలు కోల్పోయాడు.
అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఇండియాకు తిరిగి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మోదీ లాంటి రాజనీతి గలవారి నాయకత్వంలో పనిచేయడం మా అదృష్ట’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.