Satya Kumar: మంత్రి సత్యకుమార్ హెచ్చరిక.. ఆ విషయంలో జగన్‌కు శిక్ష తప్పదు..
ABN , Publish Date - Sep 25 , 2024 | 03:38 PM
తిరుమల లడ్డూ కల్తీకి పాల్పడిన మాజీ సీఎం జగన్‌ను వేంకటేశ్వరస్వామి భక్తులు, ఏపీ ప్రజలు క్షమించరని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. లడ్డూ కల్తీ చేసి అపరాచానికి పాల్పడిన ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
విజయవాడ: తిరుమల లడ్డూని కల్తీ చేసి వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వేంకటేశ్వరస్వామి భక్తులు, ఏపీ ప్రజలు ఆయణ్ని క్షమించరని అన్నారు. లడ్డూ కల్తీ చేసి అపరాచానికి పాల్పడిన ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వారధి కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు.
కమీషన్లకు కక్కుర్తి..
ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. "జగన్ హయాంలో లడ్డూ తయారీ నాణ్యతలో వైసీపీ నేతలు రాజీపడ్డారు. కమీషన్లకు కక్కుర్తి పడి నేతి సరఫరాలో నిర్లక్ష్యం వహించారు. పవిత్రమైన ప్రసాదంలో కొవ్వు కలిపి అపవిత్రం చేశారు. కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్టుల ద్వారా నిర్ధారణ అయ్యింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను జగన్ దెబ్బతీశారు. టీటీడీ ఆస్తులు వేలం వేసేందుకు యత్నించారు. శ్రీవారి నిధులు దారి మళ్లించేందుకు కుట్రలు చేశారు. వాటి కన్నా ఇప్పుడు చేసిన నేరం అమానుషం. ఈ అపచారం చేసిన వ్యక్తులందరినీ కఠినంగా శిక్షించాలి.
పొన్నవోలుకు సిగ్గుందా?
టీటీడీ బోర్డులో బీజేపీ నేతలు ఉన్నారని నింద మా పార్టీ నేతలకు ఆపాదించాలని జగన్ చూస్తున్నారు. టీటీడీ వ్యవహారాల్లో జగన్, వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి తప్ప సభ్యులందరూ డమ్మీలే కదా. ఆ ముగ్గురూ నిర్ణయాలు తీసుకుని బోర్డు మీటింగ్‌ల పేరుతో ఆమోదించేవారు. జగన్ తాను చేసిన తప్పుల నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ నేతల పాత్ర ఉందని చెబుతున్నారు. సీఎంగా ఉండి టీటీడీలో జరిగే అపచారాలను ఆపే బాధ్యత నీకు లేదా జగన్?. ఏపీ మాజీ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సిగ్గు లేకుండా వాగుతున్నారు. లడ్డూ ప్రసాదాన్ని పంది కొవ్వుతో పోలుస్తున్నాడు. అసలు ఏమైనా బుద్ది ఉందా?. వైసీపీ అధినేతకు టామాటా, పొటాటోకు కూడా తేడా తెలియదు.
ఎవరినీ వదలం..
ఫ్యాన్ పార్టీ అధినేత ఐదు నిమిషాలు మాట్లాడేతే చాలు అతని డొల్లతనం బయటపడుతుంది. లడ్డూ కల్తీ పాపంలో ఎంతమందికి భాగస్వామ్యం ఉన్నా శిక్షించాల్సిందే. ఇప్పటికే సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. చివరకు సిట్ అధికారులూ సరైన వారు కాదంటూ మాజీ సీఎం జగన్ సర్టిఫికేట్ ఇవ్వడం హాస్యాస్పదం. నెయ్యి కాంట్రాక్టులో కమీషన్లు నొక్కి స్వామివారికి అపచారం చేశారు. కాబట్టి అందరూ తప్పకుండా విచారణ ఎదుర్కొని శిక్షకు గురి కావాల్సిందే" అన్నారు.
ఇవి కూడా చదవండి..
Minister Lokesh: క్షమించండి.. ఆ ఖర్చు నేనే భరిస్తా: మంత్రి లోకేశ్..
CM Chandrababu: పార్వతమ్మ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
AP Highcourt: ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలను నిలిపివేయండి.. హైకోర్ట్ ఆర్డర్స్
Read Latest AP News And Telugu News