Share News

Minister Ramanaidu: వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థలో లోపాలు

ABN , Publish Date - Sep 27 , 2024 | 08:56 PM

రైతు సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగునీటి వ్యవస్థకు పునరుజ్జీవం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Minister Ramanaidu:  వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థలో లోపాలు
Minister Nimmala Ramanaidu

అమరావతి: రైతు సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాగునీటి వ్యవస్థకు పునరుజ్జీవం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సాగు నీటి సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైందని... ఇందుకు సంబంధించిన జీవోను మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.


ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... నవంబర్ మొదటి వారం నాటికి సాగునీటి సంఘాల ఎన్నికలు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నిర్వీర్యమైన సాగునీటి వ్యవస్థను సాగునీటి సంఘాల ద్వారా రైతుల ప్రాతినిధ్యంతో గాడిలో పెడతామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థలో పూడిక, మరమ్మత్తులు , గేట్లు, గట్ల వంటి వాటికి నిర్వహణ లేదు, పర్యవేక్షణ లేదని చెప్పారు. గత వైసీపీ పాలన రైతులకు శాపంగా మారిందని విమర్శించారు. నేడు రైతుల ప్రాతినిధ్యంతో ఇరిగేషన్ శాఖ పనిచేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. ప్రతి చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా సాగు నీటి సంఘాల ప్రాతినిధ్యంతో ఇరిగేషన్ శాఖ ప్రణాళికాబద్దంగా పని చేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.


రాతి రివిట్మెంట్ కుంగడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

నంద్యాల : అవుకు జలాశయం కరకట్ట లోపలి భాగంలో రాతి రివిట్మెంట్ కుంగిందని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ విషయంపై రైతులు అధికారులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. సకాలంలో స్పందించని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కుంగిన రాతి రివిట్మెంట్‌ను డ్యామ్ సేఫ్టీ అధికారి రత్నకుమార్ పరిశీలించారు. ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపి శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. రాతి రివిట్మెంట్ కుంగడంతో ఎలాంటి ప్రమాదం లేదని అన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.

Updated Date - Sep 27 , 2024 | 08:56 PM