Share News

Supreme Court: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంలో విచారణ ఎప్పుడంటే..

ABN , Publish Date - Sep 27 , 2024 | 08:35 PM

తిరుమల లడ్డూ (Tirumal Laddu) వివాదంపై సుప్రీంకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Former Chairman YV Subbareddy), సుబ్రహణ్యస్వామి వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు.

 Supreme Court: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంలో విచారణ ఎప్పుడంటే..

ఢిల్లీ: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. లడ్డూ కల్తీపై ప్రపంచవ్యాప్తంగా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. తిరుమల పుణ్యక్షేత్రంలో ఇంత అపచారం జరిగిందా అంటూ భక్తులు మండిపడుతున్నారు. అలాగే లడ్డూ కల్తీపై అటు కేంద్రం ఇటు ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. మాజీ సీఎం జగన్, మాజీ టీటీడీ ఈవో ధర్మారెడ్డిలను శిక్షించాల్సిందేనంటూ అమిత్ షా, సుప్రీంకోర్టు సీజేకు పలువురు లేఖలు రాశారు.

అంతే కాకుండా సుప్రీంకోర్టు జోక్యం కోరుతూ పలువురు పిటిషన్ దాఖలు చేశారు. అయితే, 30న తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. లడ్డూ వివాదంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సుబ్రమణ్య స్వామి , వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ విచారణ జరగనుంది.


ALSO READ: YS Jagan: నా మతం మానవత్వం.. వైఎస్ జగన్ సంచలనం

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సుబ్రహణ్యస్వామి వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని సుబ్రహ్మణ్యస్వామి కోరారు. విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జితో గానీ, నిపుణులతో గానీ విచారణ చేయించాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.


ALSO READ: Anam Ramanarayana: సంతకం పెట్టాల్సిందే.. లేకపోతే అడుగుపెట్టనివ్వం

మరోవైపు... తిరుమల లడ్డూపై వివాదం కొనసాగుతుండగా గత టీటీడీ పాలకమండలి నిర్ణయాలపై ఏపీ సర్కార్ విచారణకు ఆదేశించింది. దీంతో ఛైర్మన్ హోదాలో తీసుకున్న నిర్ణయాలపై వివరణ ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డిని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెవంట్ ఎస్సీ కోరారు. దీంతో వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి లేదని, టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉందని, అంతర్గత విషయాలపై విచారణ చేసేందుకు టీటీడీకీ సొంత విజిలెన్స్ విభాగం ఉందన్నారు. విజిలెన్స్ విచారణ రద్దు చేయాలంటూ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి

YS Jagan: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది: జగన్

YS Sharmila: డిక్లరేషన్‌పై మీడియా ప్రశ్న.. షర్మిల సమాధానం ఇదే..

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 27 , 2024 | 08:42 PM