Home » AP Govt
Andhrapradesh: తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తు సంబంధించిన విధివిధానాలు రూపొందే అవకాశం ఉంది. దర్యాప్తు అధికారిగా ఎవర్ని వెయ్యాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది
లడ్డూ వివాదంపై విచారణ జరుగుతుందని.. చర్యలు తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
పింక్ డైమండ్ అంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ట్వీట్లు చూస్తుంటే కడుపు మండిపోదా అని అన్నారు. సీఎం చంద్రబాబుని విజయసాయిరెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చోలేమని వార్నింగ్ ఇచ్చారు.
పింఛన్ రూ. 1000 పెంచడానికి జగన్కి ఐదేళ్లు పట్టిందని.. ఒక్క సంతకంతో రూ. 3 వేలు పింఛన్ చంద్రబాబు రూ. 4 వేలు చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 100 రోజుల్లోనే పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కోట్లాది మంది భక్తుల మనో భావాలతో ముడిపడిన అంశం కావడంతో సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
గొర్రిపూడి (కరప), సెప్టెంబరు 21: అభివృద్ధి, సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని, ప్రజలందరూ ఆశీర్వదించి రాష్ట్ర శ్రేయస్సుకు సహకరించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విజ్ఞప్తి చేశారు. శనివారం గొర్రిపూడిలో ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో 100 రోజుల పరిపాలన
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం వ్యవహారంపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు స్పందించారు. దీనికి కారణమైన వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్పై విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
. తిరుపతి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, చేప నూనె వాడటం మహా పాపం అని ఎంపీ బైరెడ్డి శబరి ఆరోపించారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిని ఎంపీ బైరెడ్డి శబరి ఉరితీసిన తప్పులేదని హెచ్చరించారు.
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వస్తున్నాడంటే దారి వెంట చెట్లు మొత్తం కొట్టేసేవారని, పరదాల మాటున వచ్చేవారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఆగిపోయేదని చెప్పారు. గతంలో ఎన్నడూ చూడనివిధంగా కూటమికి విజయం కట్టబెట్టారని అన్నారు. జగన్ సభలకు డ్వాక్రా మహిళలను లాక్కుని వచ్చేవారని ఆరోపణలు చేశారు.
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్యతో కలిసి లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలను సందర్శించారు. అక్కడ కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ఆద్య ముచ్చట పడగా పవన్ తన కూతురుకు వాటిని కానుకగా అందజేశారు.