CM Chandrababu: ఎదురుదాడి చేస్తే భయపడను.. తాటతీస్తా.. సీఎం చంద్రబాబు వార్నింగ్
ABN , Publish Date - Sep 20 , 2024 | 05:18 PM
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వస్తున్నాడంటే దారి వెంట చెట్లు మొత్తం కొట్టేసేవారని, పరదాల మాటున వచ్చేవారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఆగిపోయేదని చెప్పారు. గతంలో ఎన్నడూ చూడనివిధంగా కూటమికి విజయం కట్టబెట్టారని అన్నారు. జగన్ సభలకు డ్వాక్రా మహిళలను లాక్కుని వచ్చేవారని ఆరోపణలు చేశారు.
ప్రకాశం: వైఎస్సార్సీపీని భూస్థాపితం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తాను చాలామంది ముఖ్యమంత్రులను చూశానని.. కానీ జగన్ లాంటి సీఎంను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. 2019-2024 మధ్య పని చేసిన ముఖ్యమంత్రి లాంటి వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదు.. చూడబోనని అన్నారు. ఇవాళ(శుక్రవారం) ప్రకాశం జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
ALSO Read: Nageshwar rao: 177 ఏళ్ల నాటి సిపాయిల తిరుగుబాటును గుర్తు చేసిన జగన్ అంటూ..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వస్తున్నాడంటే దారి వెంట చెట్లు మొత్తం కొట్టేసేవారని, పరదాల మాటున వచ్చేవారని విమర్శించారు. రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఆగిపోయేదని చెప్పారు. గతంలో ఎన్నడూ చూడనివిధంగా కూటమికి విజయం కట్టబెట్టారని అన్నారు. జగన్ సభలకు డ్వాక్రా మహిళలను లాక్కుని వచ్చేవారని ఆరోపణలు చేశారు.మహిళలు రాకపోతే పింఛన్, రేషన్ కోత విధించే పరిస్థితి ఉండేదని తెలిపారు.
Deputy CM Pawan Kalyan: కూతురి ముచ్చట తీర్చిన పవన్ కళ్యాణ్.. ఏం చేశారంటే
‘మేము, మా మిత్రుడు పవన్ కళ్యాణ్, మోదీ పరిపాలనలో ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఈ 100 రోజులు పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవాలని మీ దగ్గరకు వచ్చాను. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మా ప్రభుత్వం 4 వేల పెన్షన్ ఇస్తుంది. ప్రతీ ఒక్క ఇంటికి లాభం కలగాలని ఆలోచన చేశాం. మొదటగా పెన్షన్ ఇచ్చింది దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు’’ అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
సెలవులు వచ్చినా ఉద్యోగులకు జీతాలు...
‘‘నేను మొదటిసారి సీఎం అయిన తర్వాత 75 రూపాయలకు పెన్షన్ పెంచా. ఇప్పుడిచ్చే పెన్షన్‌ను రూ.4 వేలకు నేనే పెంచా. ఉద్యోగులకు సెలవులు వచ్చినా జీతాలు ఇచ్చాం. ప్రతీ నెలకు ఒకసారి అధికారులు మీ ఇళ్లకు వచ్చి సమస్యలు తెలుసుకునేలా ప్రణాళిక చేశాను. నేను వెళ్లి పరిశీలించి ఇళ్ల వద్ద వారి సమస్యలు తెలుసుకున్నా. ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడ్డ పఠాన్ కాజావళి కుటుంబానికి ఆదుకుంటాం. గాడి తప్పిన పాలనను గాడిలో పెడతామని మమ్మల్ని గెలిపించారు. అక్టోబర్ నెలంతా గ్రామసభల ద్వారా అర్హులకు పింఛన్లు. పేదల పట్ల ఉదారంగా ఉంటా.. అధికారులు తప్పులు చేస్తే వదిలిపెట్టను. జగన్ శిష్యులు కొందరికి ప్రభుత్వం అంటే లెక్కలేనితనం ఉంది. ఎదురుదాడి చేస్తే భయపడతారనుకుంటున్నారు. ఎదురుదాడి చేస్తే భయపడను.. తాటతీస్తా’’ అని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
YS Sharmila: తిరుమల కల్తీ లడ్డూపై షర్మిల వ్యాఖ్యల్లో అర్ధమేంటి.. వైసీపీని సమర్థిస్తున్నట్టా లేక..
Gold Price Hike: బంగారం ప్రియులకు భారీ షాక్.. ఆల్ టైం హైకి ధరలు
Nara Lokesh: డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
Narayana: ఇది లక్షల భక్తుల సమస్య.. సుప్రీం విచారణ చేయాలి
Read LatestAP NewsANdTelugu News