Share News

Deputy CM Pawan Kalyan: కూతురి ముచ్చట తీర్చిన పవన్ కళ్యాణ్.. ఏం చేశారంటే

ABN , Publish Date - Sep 20 , 2024 | 04:25 PM

ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్యతో కలిసి లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలను సందర్శించారు. అక్కడ కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ఆద్య ముచ్చట పడగా పవన్ తన కూతురుకు వాటిని కానుకగా అందజేశారు.

Deputy CM Pawan Kalyan: కూతురి ముచ్చట తీర్చిన పవన్ కళ్యాణ్.. ఏం చేశారంటే
Deputy CM Pawan Kalyan

అమరావతి: ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) తన కుమార్తె ఆద్య ముచ్చటను తీర్చారు. లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను పవన్ కళ్యాణ్‌, ఆయన కుమార్తె ఆద్య తిలకించారు. అందులో కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ఆద్య ముచ్చటపడ్డారు. కూతురి ఆసక్తిని గమనించిన పవన్.. వెంటనే ఆ కళాకృతులను కొనుగోలు చేశారు. వివిధ రకాల బ్యాగ్, బొమ్మలు కొనుగోలు చేసి తన కుమార్తెకు కానుకగా పవన్ కళ్యాణ్ ఇచ్చారు.


PAWAN-2.jpg

లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలను పవన్ కళ్యాణ్ ఈరోజు(శుక్రవారం) పరిశీలించారు. అతిథుల గౌరవార్థం ఇచ్చే జ్ఞాపికలు, శాలువాలకు శాఖాపరంగా బడ్జెట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ తన శాఖకు కేటాయించిన సంబంధిత బడ్జెట్ నుంచి 40 శాతం మాత్రమే తీసుకొని మిగిలిన 60 శాతం తన సొంత సొమ్మును కలుపుకుని కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధం చేయాలని తన పేషీ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.


ALSO Read: Nageshwar rao: 177 ఏళ్ల నాటి సిపాయిల తిరుగుబాటును గుర్తు చేసిన జగన్ అంటూ..

తద్వారా రాష్ట్ర కళాసంపదకు ప్రాచుర్యం అందించడంతోపాటు హస్త కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. ఎంపిక చేసిన వాటితో గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్ర, అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని పవన్ సూచించారు. అతిథుల గౌరవార్థం ఇచ్చే జ్ఞాపికలు, శాలువాలకు శాఖాపరంగా ఇచ్చే బడ్జెట్‌లో 40 శాతం మాత్రమే తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన 60 శాతం సొంత సొమ్ముతో కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధం చేయాలని పేషీ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఆదేశించారు.

PAWAN-1.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

YS Sharmila: తిరుమల కల్తీ లడ్డూపై షర్మిల వ్యాఖ్యల్లో అర్ధమేంటి.. వైసీపీని సమర్థిస్తున్నట్టా లేక..

Gold Price Hike: బంగారం ప్రియులకు భారీ షాక్.. ఆల్ టైం హైకి ధరలు

Nara Lokesh: డయాలసిస్‌ సెంటర్‌‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

Narayana: ఇది లక్షల భక్తుల సమస్య.. సుప్రీం విచారణ చేయాలి

Read Latest AP News ANd Telugu News

Updated Date - Sep 20 , 2024 | 04:33 PM