Home » AP Govt
తిరుపతి లడ్డూ తయారీలో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై ఈ రోజు సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్‌లతో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారు. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Andhrapradesh: నిత్యం పరదాల మాటున కాకుండా ప్రజల్లోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ఉన్నారు. 100 రోజుల పాలనకు గుర్తుగా ఈరోజు నుంచి ఈ నెల 26 వతేది దాకా ' ఇది మంచి ప్రభుత్వం ' పేరుతో ప్రజల్లోకి ప్రజాప్రతినిధులు వెళ్లనున్నారు.
కల్తీ నెయ్యికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని మంత్రి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే తిరుపతి వచ్చి ప్రమాణం చేయాలని వైవీ సుబ్బారెడ్డికి సవాల్ విసిరారు. వైవీ సుబ్బారెడ్డి అహంకార ధోణితో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పింక్ డైమండ్‌ను రాజకీయం చేశారని అన్నారు.
డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అమరావతిలో డ్వాక్రా మహిళల ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కోసం 10 ఎకరాలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. అన్న క్యాంటీన్ల కోసం సుమారు రూ. 150 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
త్వరలోనే ఏపీలో కూడా హైడ్రా తరహాలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. సీపీ హయాంలో పనిచేసిన ప్రజాప్రతినిధులే చాలా అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు చేశారు. వాటిపై కూడా ప్రత్యేక దృష్టిసారించి కూల్చివేతలకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తనను మానసికంగా, శారీరకంగా వైసీపీ నేతలు ఇబ్బంది పెట్టారని ముంబై నటి కాదంబరి జెత్వాని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కోరానని అన్నారు. ఎన్టీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నటి కాదంబరి జెత్వాని ధన్యవాదాలు తెలిపారు.
AP Flood Victims: ఏపీలో వరద బాధితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అధిక వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని కలెక్టర్ లోతేటి శివశంకర్ పేర్కొన్నారు.
వంటనూనెలపై కస్టమ్స్ సుంకం పెంచే అవకాశం ఉందని పుకార్లు వస్తున్ననేపథ్యంలో ఏపీలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఈరోజు(మంగళవారం) తనిఖీలు చేపట్టింది పామోలిన్, ఇతర ఎడిబుల్ ఆయిల్ ధరల్లో పెరుగుదల, కల్తీపై ఆకస్మిక తనిఖీలు చేసినట్లు విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.