Share News

kadambari Jethwani: మరోసారి సంచలన విషయాలు బయటపెట్టిన నటి కాదంబరి జెత్వాని

ABN , Publish Date - Sep 19 , 2024 | 03:32 PM

తనను మానసికంగా, శారీరకంగా వైసీపీ నేతలు ఇబ్బంది పెట్టారని ముంబై నటి కాదంబరి జెత్వాని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కోరానని అన్నారు. ఎన్టీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నటి కాదంబరి జెత్వాని ధన్యవాదాలు తెలిపారు.

 kadambari Jethwani: మరోసారి సంచలన విషయాలు బయటపెట్టిన  నటి కాదంబరి జెత్వాని
Actress kadambari Jethwani

అమరావతి: వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు గురైన ముంబై నటి కాదంబరి జెత్వాని ఇవాళ (గురువారం) ఏపీ హోంమంత్రి అనితను రాష్ట్ర సెక్రటేరియట్‌లో కలిశారు. తనపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలంటూ హోంమంత్రిని కోరారు. ఈ సందర్భంగా మరోసారి ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను నటి కాదంబరి జెత్వాని మీడియాకు వెల్లడించారు.


ALSO Read: Kadambari Jethwani: హోంమంత్రి అనితను కలవనున్న నటి కాదంబరి జెత్వానీ.. ఎందుకంటే?

నాకు, నా ఫ్యామిలీకి రక్షణ ఇవ్వాలి..

‘‘నా తల్లిదండ్రులు, అడ్వకేట్‌తో కలిసి ఈరోజు హోంమంత్రిని కలిశా. నాపై వైసీపీ నేతలు ఫాల్స్ కేసు పెట్టారని వివరించా. నాపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై చాలా గట్టిగా పోరాటం చేశా. నాకు, నా ఫ్యామిలీకి రక్షణ ఇవ్వాలి. నన్ను వైసీపీ నేతలు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టారు. నాకు వ్యక్తిగతంగా చాలా నష్టం కలిగించారు. దానికి పరిహారం ఇవ్వాలని అడిగాం. మాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరా. ఎన్టీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ధన్యవాదాలు. ప్రభుత్వం, మీడియా మాతో కలిసి పోరాటం చేశారు. ఈ కేసులో పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ ఎంత ఉందనేది తెలియదు. అంతా పోలీసుల విచారణలో తేలుతుంది’’ అని నటి కాదంబరి జెత్వాని తెలిపారు.


ALSO Read: YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. మరో ముఖ్య నేత జంప్.!

న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం: న్యాయవాది నర్రా శ్రీనివాసరావు

అనంతరం మీడియాతో న్యాయవాది నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముంబైలో నటి కాదంబరి జెత్వానిపై ఉన్న కేసుపై అక్కడ తేల్చుకుంటారు. ఆమె ఐఫోన్లు 2 సార్లు ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారు దానికి సంబంధించిన అలర్ట్‌లు వచ్చాయి. ఐఫోన్లు ఓపెన్ చేయడం కుదరకపోవడంతో దాంట్లో ఉన్న డేటా డిలీట్ చేయాలని చూశారు. ఫోన్ లాక్ ఓపెన్ చేయాలని చూడటంతో నటి కాదంబరి జెత్వానికి మెయిల్ అలెర్ట్ వచ్చింది. ఐఫోన్‌లో సూపర్ సెక్యూరిటీ ఉండటం వల్ల ఫోన్ ఓపెన్ చేయలేకపోయారు. ఈ కేసులో నటి కాదంబరి జెత్వానికి న్యాయం జరగాలి. భారతదేశ చరిత్రలో ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ అయినా ఇలాంటి కేస్‌ను ఇప్పటి వరకు చూడలేదు. దుబాయ్‌లో ఉన్న ఆమె బ్రదర్‌కు ఇచ్చిన లుక్‌ఔట్ నోటీసును వెనక్కి తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఈ కేసులో పెద్దవాళ్ల పేర్లు ఉన్నాయని విచారణలో తెలిస్తే వారిపైన పోరాటం చేస్తాం. నటి కాదంబరి జెత్వానికి 23 రోజుల బెయిల్ వేయలేదంటే ఈ కేసు గురించి అర్ధం చేసుకోవాలి. ఈ కేసులో ఎంత అధికార దుర్వినియోగం జరిగిందో అర్ధమవుతోంది. ఆమెకు బెయిల్ వచ్చాక అప్పటి సీపీ కాంతిరాణాను కలిశారు. ఫాల్స్ కేస్ తీసేయాలని అడిగారు. అయితే  ఈకేసును తీసేయలేదు’’ అని న్యాయవాది నర్రా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Nagababu: నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా

Purandeshwari: జమిలి ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నాం..

Dola Anjaneyulu: పుట్టలో నుంచి పాములు వస్తున్నట్లుగా జగన్ పాపాలు బయటకు....

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 19 , 2024 | 03:49 PM