Share News

Minister Kondapalli: అభయహస్తం నిధులను వైసీపీ కాజేసింది

ABN , Publish Date - Sep 19 , 2024 | 09:24 PM

డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ హామీ ఇచ్చారు. అమరావతిలో డ్వాక్రా మహిళల ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కోసం 10 ఎకరాలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

Minister Kondapalli: అభయహస్తం నిధులను వైసీపీ కాజేసింది

అమరావతి: సామాజిక పెన్షన్ల అర్హత నిర్థారణ అంశంపై త్వరలోనే కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం ఏర్పాటవుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. కొందరు అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారని అన్నారు. ఈరోజు(గురువారం) ఏపీ సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ... బైక్‌లు నడుపుతున్న కొంతమంది రూ.15 వేల వికలాంగ పెన్షన్‌ తీసుకుంటున్నారని చెప్పారు. డ్వాక్రా సంఘాలను మైక్రో పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని మాటిచ్చారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.


ALSO Read:YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. మరో ముఖ్య నేత జంప్.!

డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అమరావతిలో డ్వాక్రా మహిళల ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కోసం 10 ఎకరాలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రూ.2100 కోట్ల అభయహస్తం నిధులను కాజేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆరోపించారు.


ALSO Read:Tirupati Laddu: లడ్డు అపవిత్రం చేసిన వారిని వదలిపెట్టం.. సీఎం చంద్రబాబు సూటి హెచ్చరిక

జగన్ ప్రభుత్వం స్త్రీనిధి బ్యాంక్‌ను అప్పుల్లో ముంచిందని విమర్శలు చేశారు. గత ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు చెందిన రూ.950 కోట్ల స్త్రీనిధిని పీడీ ఖాతాలకు మళ్లించిందని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై విచారణ చేయించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

kadambari Jethwani: మరోసారి సంచలన విషయాలు బయటపెట్టిన నటి కాదంబరి జెత్వాని

Purandeshwari: జమిలి ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నాం..

Dola Anjaneyulu: పుట్టలో నుంచి పాములు వస్తున్నట్లుగా జగన్ పాపాలు బయటకు....

Kadambari Jethwani: హోంమంత్రి అనితను కలవనున్న నటి కాదంబరి జెత్వానీ.. ఎందుకంటే?

Nagababu: నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా

Read LatestAP News And Telugu News

Updated Date - Sep 19 , 2024 | 09:27 PM