CM Chandrababu: అన్న క్యాంటీన్లపై కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి
ABN , Publish Date - Sep 19 , 2024 | 08:55 PM
అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. అన్న క్యాంటీన్ల కోసం సుమారు రూ. 150 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
అమరావతి: అన్న క్యాంటీన్ల మీద కూడా కొన్ని పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. సేవా కార్యక్రమాలపైనా ఈ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవాభావంతో పని చేసే కార్యక్రమాలపై విమర్శలు చేయడం దివాళాకోరుతనమేనని అన్నారు. ఈరోజు( గురువారం) ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటి వరకు 175 అన్న క్యాంటీన్లను ప్రారంభించామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదో పవిత్ర కార్యక్రమమని అన్నారు. పేదలకు అన్నం పెట్టేందుకు ఈ పథకాన్ని ప్రారంభించామని గుర్తుచేశారు. పరిశుభ్రమైన, పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశ్యంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించామని సీఎం చంద్రబాబు వివరించారు.
ALSO Read:Tirupati Laddu: లడ్డు అపవిత్రం చేసిన వారిని వదలిపెట్టం.. సీఎం చంద్రబాబు సూటి హెచ్చరిక
రూ. 15తో మూడు పూటల అన్నం పెట్టే ఉద్దేశ్యంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించామని అన్నారు. ప్రతి అన్న క్యాంటీన్లల్లో పేదలు భోజనం చేస్తున్నారని తెలిపారు. వరద సాయం కోసం చిన్నారులు మొదలుకుని చాలా మంది విరాళాలు ఇచ్చారని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. మంచికి స్థానం ఉందని దాతలు నిరూపించారని ప్రశంసించారు. అన్న క్యాంటీన్ల ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని కోరారు. అన్న క్యాంటీన్ల కోసం సుమారు రూ. 150 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ALSO Read:YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. మరో ముఖ్య నేత జంప్.!
ఈ ఖర్చును ప్రభుత్వం భరించగలదని స్పష్టం చేశారు. కానీ ప్రజల్లో సేవా స్ఫూర్తిని పెంచేందుకు విరాళాలు అడుగుతున్నామని అన్నారు. ఏపీలో చేపట్టిన వరద సహయక చర్యలను దేశం మొత్తం గుర్తించిందని సీఎం చంద్రబాబు చెప్పారు. జల్ జీవన్ మిషన్ స్కీంను అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకున్నాయని వివరించారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఏపీ మాత్రం జల్ జీవన్ మిషన్ వినియోగించుకోలేకపోయిందని విమర్శలు చేశారు. జల్ జీవన్ మిషన్ స్కీంను వినియోగించుకోకుండా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీకి ద్రోహం చేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
kadambari Jethwani: మరోసారి సంచలన విషయాలు బయటపెట్టిన నటి కాదంబరి జెత్వాని
Purandeshwari: జమిలి ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నాం..
Dola Anjaneyulu: పుట్టలో నుంచి పాములు వస్తున్నట్లుగా జగన్ పాపాలు బయటకు....
Kadambari Jethwani: హోంమంత్రి అనితను కలవనున్న నటి కాదంబరి జెత్వానీ.. ఎందుకంటే?
Nagababu: నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా
Read LatestAP NewsAndTelugu News