Home » AP Grama Volunteer
‘గడప గడపకు’ కార్యక్రమం సందర్భంగా తనను ఎమ్మెల్యే బెదిరించారని వలంటీర్, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
నెల్లూరు జిల్లా: మర్రిపాడు మండలం, నాగినేని గుంట గ్రామంలో ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఇలాకాలో మరో వాలంటీర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా వేలిముద్ర వేయించుకొని...
వలంటీర్ల(volunteers) ద్వారా సర్పంచ్ల(Sarpanches) అధికారాలను సీఎం జగన్(CM Jagan) లాక్కుంటున్నారని జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. శనివారం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. వలంటీర్ వ్యవస్థను తెచ్చి పంచాయతీరాజ్‌కు పోటీగా నడుపుతున్నారని వైసీపీ ప్రభుత్వం(YCP Govt)పై ధ్వజమెత్తారు. ప్రజలకు చేరువ అయ్యే మనుషులుగా కాకుండా వలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా ఉన్నారని మండిపడ్డారు. సర్పంచ్‌లు కష్టపడి ఎన్నికల్లో విజయం సాధిస్తే వారికి హక్కులు లేకుండా చేశారని దుయ్యబట్టారు.
వలంటీర్ల బాగోతాలు అన్నీ ఇన్నీ కావు. రోజుకొకరి బాగోతం వెలుగు చూస్తోంది. అవసరం కోసం జాబ్ తెచ్చుకుని కష్టపడి చేసేవాళ్లు లేకపోలేదు. కానీ కొందరి పనితీరు కారణంగా మొత్తం వలంటీర్ వ్యవస్థకే మచ్చ వస్తోంది. వరద సహాయం పంపిణీలో వలంటీర్ చేతివాటం చూపిన ఘటన పెద్ద ఎత్తున కలకలం రేపింది.
వలంటీర్ల దురాగతాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. మొన్న వృద్ధురాలి హత్య.. నిన్న యువతికి వేధింపులు.. నేడు మరొకటి. ఈ వలంటీర్ ఉండేది బెంగుళూరులో. కానీ ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామంలో బయోమెట్రిక్‌తో పింఛన్లు పంపిణీ చేస్తుంటాడు. అదెలాగో తెలిస్తే.. మీరు కూడా ఈ వలంటీర్ మహా ముదురు అనక మానరు.
రాష్ట్రంలో వార్డు, గ్రామ వలంటీర్ల వ్యవహారంపై తీవ్ర దుమారం రేగుతున్న సమయంలోనే వార్డు వలంటీర్ల ఘాతుకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిన్నటికి నిన్న వృద్ధురాలి హత్య ఘటన మరువకముందే మరో వలంటీర్ దారుణానికి పాల్పడ్డాడు.
నగరంలో దారుణం జరిగింది. ఓ వృద్ధురాలిని గ్రామ వాలంటీర్(Volunteer) హత్య చేశాడు. పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్(Sujatanagar)లో ఈ ఘటన చోటుచేసుకుంది.
జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌పై ‘ప్రాసిక్యూషన్’ వలంటీర్ల వ్యవస్థకే చిక్కులు తెస్తుందా? వలంటీర్ల వ్యవస్థపై ఇప్పటిదాకా లేవనెత్తని, ప్రభుత్వం సమాధానం చెప్పలేని కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తాయా?
పౌరుల డేటా సేకరణపై వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. నేడు ఆయన ట్విటర్ వేదికగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘వలంటీర్ల బాస్ ఎవరు? ప్రైవేట్ డేటాను సేకరించడానికి వారికి ఎవరు సూచనలు ఇస్తారు? ఇది ప్రైవేట్ కంపెనీ అయితే, దానికి అధిపతి ఎవరు? అది AP ప్రభుత్వమైతే డేటా సేకరించమని ఎవరు ఆదేశించారు? అది చీఫ్ సెక్రటరీనా? సీఎం? కలెక్టరా? ఎమ్మెల్యే? ఎవరు?’’ అంటూ ప్రధాని, కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (YCP Minister Karumuri Nageswara Rao) సవాల్ విసిరారు.