Nellore: ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఇలాకాలో వాలంటీర్ నిర్వాకం..

ABN , First Publish Date - 2023-08-06T10:01:29+05:30 IST

నెల్లూరు జిల్లా: మర్రిపాడు మండలం, నాగినేని గుంట గ్రామంలో ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఇలాకాలో మరో వాలంటీర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా వేలిముద్ర వేయించుకొని...

Nellore: ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఇలాకాలో వాలంటీర్ నిర్వాకం..

నెల్లూరు జిల్లా: మర్రిపాడు మండలం, నాగినేని గుంట గ్రామంలో ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి (MLA Vikram Reddy) ఇలాకాలో మరో వాలంటీర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ (Bank) మొబైల్ యాప్ (Mobile App) ద్వారా వేలిముద్ర వేయించుకొని హుస్సేనమ్మకు రావాల్సిన అమ్మ ఒడి (Amma Odi) నగదును వాలంటీర్ (Volunteer) ఖాసిం పీర కాజేశాడు. అయితే నగదు తీసుకునేందుకు హుస్సేనమ్మ బ్యాంక్‌కు వెళ్లారు. ఆమె అకౌంట్‌లో డబ్బులు లేకపోవడంతో వాలంటీర్‌ను నిలదీశారు. ‘డబ్బులు నేనే తీసుకున్నాను.. ఇస్తానంటు వాలంటీర్ ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ’ హుస్సేనమ్మ ఆరోపించారు. అదే గ్రామంలో ఈ నెల 2వ తేదీన 19 మంది పెన్షన్ లబ్ధిదారులకు ఇవ్వాల్సిన రూ. 57,000 నగదు తీసుకుని మరో వాలంటర్ నల్లిపోగు ఖాదర్ బాబు పరారయ్యాడు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-08-06T10:01:29+05:30 IST