AP News : ఉండేది బెంగుళూరు.. ఏపీలో బయోమెట్రిక్‌తో పింఛన్లు పంపిణీ చేస్తుంటాడు.. అదెలాగో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-08-02T11:07:24+05:30 IST
వలంటీర్ల దురాగతాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. మొన్న వృద్ధురాలి హత్య.. నిన్న యువతికి వేధింపులు.. నేడు మరొకటి. ఈ వలంటీర్ ఉండేది బెంగుళూరులో. కానీ ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామంలో బయోమెట్రిక్‌తో పింఛన్లు పంపిణీ చేస్తుంటాడు. అదెలాగో తెలిస్తే.. మీరు కూడా ఈ వలంటీర్ మహా ముదురు అనక మానరు.
ప్రకాశం : వలంటీర్ల దురాగతాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. మొన్న వృద్ధురాలి హత్య.. నిన్న యువతికి వేధింపులు.. నేడు మరొకటి. ఇప్పుడు చెబుతున్న వలంటీర్ ఉండేది బెంగుళూరులో. కానీ ప్రకాశం జిల్లాలోని ఓ గ్రామంలో బయోమెట్రిక్‌తో పింఛన్లు పంపిణీ చేస్తుంటాడు. అదెలాగో తెలిస్తే.. మీరు కూడా ఈ వలంటీర్ మహా ముదురు అనక మానరు.
ప్రకాశం జిల్లా పామూరు మండలం కందులవారిపల్లిలో రాచగొర్ల గురుప్రసాద్ అనే వ్యక్తి వలంటీర్‌గా పని చేస్తున్నాడు. నిజానికి ఇతను ఉండేది బెంగుళూరు. ఇక్కడ పింఛన్ల పంపిణీ వంటి కార్యకలాపాలు మాత్రం యథావిధిగా జరిగిపోతూ ఉంటాయి. మరి వేలిముద్రలు ఎక్కడి నుంచి వస్తాయి? అంటారా? అందుకే మనోడు మహా ముదురని చెప్పింది. ప్లాస్టిక్ వేలి ముద్రలను తయారు చేసి తన సోదరుడు గురుస్వామికి ఇచ్చాడు.
ఇక ఆ ప్లాస్టిక్ వేలిముద్రల సాయంతో గురుస్వామి పింఛన్లు పంపిణీ చేస్తుంటాడన్న మాట. మరో విషయం ఏంటంటే.. ఈ తమ్ముడు సారూ.. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లడు. వారినే తమ ఇంటికి పిలిపించుకుని ప్లాస్టిక్ వేలిముద్రలతో బయోమెట్రిక్ వేసి లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేస్తాడు. ఇలా తాజాగా కొందరు లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేయడంతో మిగిలిన లబ్దిదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వలంటీర్ గురుప్రసాద్ బాగోతం వెలుగు చూసింది. అధికారులు విచారణ చేపట్టారు.