Volunteer : వృద్ధురాలిని హతమార్చిన ఘటన మరువకముందే మరో వలంటీర్ ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2023-08-01T11:54:40+05:30 IST

రాష్ట్రంలో వార్డు, గ్రామ వలంటీర్ల వ్యవహారంపై తీవ్ర దుమారం రేగుతున్న సమయంలోనే వార్డు వలంటీర్‌ల ఘాతుకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిన్నటికి నిన్న వృద్ధురాలి హత్య ఘటన మరువకముందే మరో వలంటీర్ దారుణానికి పాల్పడ్డాడు.

Volunteer : వృద్ధురాలిని హతమార్చిన ఘటన మరువకముందే మరో వలంటీర్ ఏం చేశాడంటే..

కర్నూలు : రాష్ట్రంలో వార్డు, గ్రామ వలంటీర్ల వ్యవహారంపై తీవ్ర దుమారం రేగుతున్న సమయంలోనే వార్డు వలంటీర్‌ల ఘాతుకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిన్నటికి నిన్న వృద్ధురాలి హత్య ఘటన మరువకముందే మరో వలంటీర్ దారుణానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఓ యువతితో వలంటీర్ అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కల్లూరు మండలం ఉలింకొండకు చెందిన మధుకృష్ణ అనే వలంటీర్ తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళుతున్నాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న తమ గ్రామానికి చెందిన యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. కొందరు రాజకీయ నాయకులు ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా తొక్కిపట్టినట్టు సమాచారం.

రాష్ట్రంలో వార్డు, గ్రామ వలంటీర్ల వ్యవహారంపై తీవ్ర దుమారం రేగుతున్న సమయంలోనే విశాఖపట్నంలో ఓ వార్డు వలంటీర్‌ బంగారం కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేశాడు. ఇది సంచలనంగా మారింది. పలు ప్రాంతాల్లో మహిళలు అదృశ్యం కావడంలో వలంటీర్ల పాత్ర ఉందని ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వారు సక్రమంగానే విధులు నిర్వహిస్తున్నారని, కుటుంబ సభ్యుల్లా ఉంటూ వృద్ధులకు ఒకటో తేదీన ఇంటికి వెళ్లి మరీ పెన్షన్లు ఇస్తున్నారని, వారి సేవాభావం వెలకట్ట లేనిదని వైసీపీ నాయకులు సెలవిచ్చారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం శివారు పెందుర్తి మండలం పురుషోత్తపురం గౌరీవిశ్వేశ్వర కాలనీ వలంటీర్‌గా పనిచేస్తున్న రాయవరపు వెంకటేశ్‌ బంగారం కోసం ఆదివారం రాత్రి ఓ వృద్ధురాలిని హత్య చేశాడు. వలంటీర్‌గా వస్తున్న రూ.5 వేల గౌరవ వేతనం కుటుంబ పోషణకు సరిపోవడం లేదని, ఇరవై రోజుల క్రితం ఓ ఫాస్ట్‌పుడ్‌ సెంటర్‌లో పార్ట్‌టైమ్‌గా పనికి చేరాడు. ఆ యజమాని తల్లి ఇంట్లో ఒంటరిగా ఉంటోందని గమనించి, ఆమె మెడలో బంగారం కొట్టేయాలనుకున్నాడు. ఆమె ప్రతిఘటించడంతో చంపేశాడు. ఇది విశాఖపట్నంలో సోమవారం కలకలం రేపింది. ఇక తాజాగా యువతిపై అసభ్య ప్రవర్తనతో మరోసారి వలంటీర్ల ఆగడాలపై చర్చ మొదలైంది.

Updated Date - 2023-08-01T11:54:40+05:30 IST