YCP Minister: పవన్ కల్యాణ్‌కు వైసీపీ మంత్రి సవాల్.. వాలంటీర్‌ను అరెస్ట్ చేస్తే ఊరేసుకుంటా

ABN , First Publish Date - 2023-07-15T16:46:13+05:30 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (YCP Minister Karumuri Nageswara Rao) సవాల్ విసిరారు.

YCP Minister: పవన్ కల్యాణ్‌కు వైసీపీ మంత్రి సవాల్.. వాలంటీర్‌ను అరెస్ట్ చేస్తే ఊరేసుకుంటా

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (YCP Minister Karumuri Nageswara Rao) సవాల్ విసిరారు.

"పవన్ కల్యాణ్ నరేంద్ర సెంటర్‌లో ఏ ఒక్క వాలంటీర్‌నైనా (volunteer) అరెస్ట్ చేసి జైలుకు పంపించే కార్యక్రమం నువ్వు చేయగల్గితే.. నేను నరేంద్ర సెంటర్‌లో ఉరేసుకుంటా."అని వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.


పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. ప్రస్తుతం కారుమూరి నాగేశ్వరరావు సీఎం జగన్‌ కేబినెట్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు.


కాగా.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సింగిల్‌గా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ముందు ఎన్నికలు వచ్చినా, వెనుక వచ్చినా తాము రెడీ అని అన్నారు. అన్ని ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీ చేసి విజయం సాధించామని తెలిపారు. గత ఎన్నికల కంటే ఈ సారి ఎక్కువ సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాము షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. బీజేపీ ఎవరిని అధ్యక్షురాలిగా పెట్టుకున్న తమకు సంబంధం లేదన్నారు. మూడు పార్టీలు కలిసినా, బీఆర్ఎస్‌ కలిసినా తాము ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తామన్నారు. టీడీపీ రూ.20 వేల కోట్ల అప్పులు చేసిందని.. వాటిని పసుపు, కుంకుమకు మళ్లించారని తెలిపారు. ఆ అప్పులన్నీ తాము తీర్చి, శాఖను మళ్లీ గాడిలో పెట్టామన్నారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. ధాన్యం తడిసినా, నూక వస్తున్నా రైతులకు మద్దతు ధర ఇచ్చామన్నారు. కోటి 46 లక్షల మందికి రేషన్ ఇస్తున్నామని చెప్పారు. కేంద్రం కంటే అదనంగా 60 లక్షల కార్డులు ఇచ్చామని.. వాటికి కేంద్రం సాయం చేయాలని కోరామన్నారు. నీతి ఆయోగ్ దీనికి అనుకూలంగా సిఫారసు చేసిందని మంత్రి కారుమూరి నాగేశ్వరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-07-15T16:54:49+05:30 IST