Home » AP High Court
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో(AP High Court) రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రం, రాష్ట్రం నిధులు(Govt Funds) జమ చేయకుండా చేసినట్లు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ధర్మాసనం. కోర్టు భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం జమచేయాల్సిన రూ.75 కోట్లు సొమ్ము ఎక్కడని రాష్ట్ర ప్రభుత్వాన్ని(Andhra Pradesh Govt) హైకోర్టు ప్రశ్నించింది.
Andhrapradesh:
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతాపై నమోదైన కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్ట్ అసహనం వ్యక్తం చేసింది. కేసు పెట్టిన కృష్ణారెడ్డి తరపున న్యాయవాదిని కౌంటర్ దాఖలు చేసేందుకు ఎంత సమయం తీసుకుంటారని హైకోర్ట్ ప్రశ్నించింది.
Andhrapradesh: టెట్ , డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. టెట్ , డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్ట్ తీర్పునిచ్చింది. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్‌ను ధర్మాసనం సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చ్ 14న వస్తున్నాయని , మార్చ్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్ట్‌లో పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు.
సీఎం జగన్ రెడ్డి(CM Jagan) గత ఎన్నికల్లో మాజీమంత్రి వివేకానందారెడ్డి (బాబాయ్) హత్య, కోడి కత్తి శీను పేరు చెప్పి లాభం పొందారని మాజీ ఎంపీ హర్ష కుమార్(Harsha Kumar) అన్నారు. శనివారం నాడు హర్ష కుమార్‌ను కోడి కత్తి శీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు.
అమరావతి: ఏపీలో అక్రమ మైనింగ్‌పై హైకోర్టు సీరియస్ అయింది. అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించింది. గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలం, వీరంకినాయుడు పాలెంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ఎం ప్రభుదాస్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై బుధవారం విచారణ జరిగింది.
హైదరాబాద్: విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తికే కేటు గాళ్ళు టోకరా వేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి విరాళాల పేరుతో మోసం చేశారు. రాజకీయ పార్టీకి బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మాయమాటలు చెప్పి మోసం చేశారు.
Andhrapradesh: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. భూసేకరణ ప్రక్రియలో సేకరించిన భూముల్లో ఇచ్చిన ప్లాట్స్‌ను రద్దు చేస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను ధర్మాసనం కొట్టివేసింది. రైతులకు ఇచ్చిన ప్లాట్స్‌ను రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసులను కూడా హైకోర్ట్ ధర్మాసనం కొట్టేసింది. కమిషనర్, డిప్యూటీ తహశీల్దార్ ఇచ్చిన నోటీస్‌లు చెల్లవని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Andhrapradesh: డీఎస్సీ నోటిఫికేషన్లో ఎస్జీటీ పోస్ట్‌లకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై హైకోర్ట్ స్టే విధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని హైకోర్టుకు ప్రభుత్వం చెప్పింది. జీవో 4 ప్రకారం టీచర్ల భర్తీ చేపడతామని వివరణ ఇచ్చింది.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించడాన్ని హైకోర్టు సీజే ధర్మాసనం తప్పుబట్టింది.