AP Highcourt: ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అనుమతిపై హైకోర్టు స్టే
ABN , Publish Date - Feb 21 , 2024 | 12:19 PM
Andhrapradesh: డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఎస్‌జీటీ పోస్ట్‌లకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై హైకోర్ట్ స్టే విధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని హైకోర్టుకు ప్రభుత్వం చెప్పింది. జీవో 4 ప్రకారం టీచర్ల భర్తీ చేపడతామని వివరణ ఇచ్చింది.
అమరావతి, ఫిబ్రవరి 21: డీఎస్సీ నోటిఫికేషన్‌లో (DSC Notification) ఎస్‌జీటీ పోస్టులకు (SGT Posts) బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై హైకోర్ట్ (AP HighCourt) స్టే విధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Government) విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని హైకోర్టుకు ప్రభుత్వం చెప్పింది. జీవో 4 ప్రకారం టీచర్ల భర్తీ చేపడతామని వివరణ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన వివరాలను ధర్మాసనం నమోదు చేసింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి ఉత్తర్వులను అనుమతించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. నోటిఫికేషన్‌లో ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతిస్తున్న నిబంధనను స్టే చేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పలు పిటిషన్లు తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు, హైకోర్ట్ న్యాయవాదులు జడ శ్రవణ్, జువ్వాడి శరత్ చంద్ర వాదనలు వినిపించారు. తదుపరి విచారణను హైకోర్టు ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..