AP Highcourt: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్‌కు షాక్...
ABN , Publish Date - Mar 04 , 2024 | 03:46 PM
Andhrapradesh: టెట్ , డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. టెట్ , డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్ట్ తీర్పునిచ్చింది. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్‌ను ధర్మాసనం సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చ్ 14న వస్తున్నాయని , మార్చ్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్ట్‌లో పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు.
అమరావతి, మార్చి 4: టెట్ (TET) , డీఎస్సీ పరీక్షలకు (DSC Exams) సంబంధించి ఏపీ ప్రభుత్వానికి (AP Government) హైకోర్టులో (AP HighCourt) గట్టి షాక్ తగిలింది. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్ట్ తీర్పునిచ్చింది. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్‌ను ధర్మాసనం సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14న వస్తున్నాయని , మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్ట్‌లో పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈరోజు (సోమవారం) హైకోర్టులో విచారణకు రాగా... పిటిషనర్ల తరపున న్యాయవాది జువ్వాడి శరత్ చంద్ర (lawyer Juvwadi Sarath Chandra) వాదనలు వినిపించారు.
BTech Ravi: దమ్ముంటే అవినాష్ నార్కో అనాలసిస్‌కు ఒప్పుకో.. ఇదే నా సవాల్..!
కేవలం ఒక్క రోజు సమయంలో విద్యార్థులు (Students) ఎలా ప్రిపేర్ అవుతారని శరత్ చంద్ర ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎప్పుడు అటువంటి షెడ్యూల్ ఇవ్వలేదని వాదించారు. నిరుద్యోగుల హక్కులను హరిస్తున్నారని న్యాయవాదలు ఆందోళన వ్యక్తం చేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్‌ను సస్పెండ్ చేసింది. టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలకు నాలుగు వారాలు కనీసం సమయం ఉండాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఐదేళ్ల తరువాత ఇచ్చిన షెడ్యూల్ ఎలాంటి ప్రణాళిక లేకుండా ఇవ్వడంపై హైకోర్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి...
Kavitha: ఆ జీవోతో ఆడబిడ్డల నోట్లో మట్టి కొట్టారు... కాంగ్రెస్ సర్కార్‌పై కవిత ఫైర్
Delhi: సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు.. తీవ్రంగా మండిపడ్డ సుప్రీంకోర్టు.. ఏమందంటే
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...