Home » AP High Court
ఎట్టకేలకు ఉన్నత విద్యాశాఖ దిగివచ్చింది. బీఈడీ కళాశాలలో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తూ విద్యాశాఖ అధికారులు తనిఖీలను సాకుగా చూపుతున్నారు. దీనిపై ఏపీ హైకోర్టును బీఈడీ కళాశాలల సంఘం ఆశ్రయించింది.
Andhrapradesh: ఏపీ హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉండి ఆపై అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరికి బెయిల్ మంజూరు అయ్యింది. కాసేపటి క్రితమే దస్తగిరికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Andhrapradesh: కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోడికత్తి శ్రీను తరుపున సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి మహేష్ పిటిషన్ దాఖలు చేశారు.
సంక్రాతి పండుగకు తన సొంత నియోజకవర్గం నరసాపురానికి వస్తున్న తనపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఎంపీ రఘురామకృష్ణ రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. చట్ట నిబంధనలు పాటించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ( MP Raghuramakrishna Raju ) ఏపీ హైకోర్టు ( AP High Court ) లో గురువారం నాడు పిటీషన్ వేశారు. సంక్రాంతి పండుగకు తమ ఊరు వచ్చేందుకు తనకు రక్షణ కల్పించాలని రఘురామ పిటీషన్లో తెలిపారు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu )కు ఏపీ హైకోర్టు ( AP High Court ) లో భారీ ఊరట లభించింది. బుధవారం నాడు హైకోర్టులో చంద్రబాబుపై ఉన్న పలు కేసులపై విచారణ జరిగింది.
Andhrapradesh: తనపై జారీ చేసిన లుక్ ఔట్ సర్క్యులర్‌ను ఎన్ఆర్ఐ, టీడీపీ నేత యాష్ బొద్దులూరు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరిగింది. యాష్ తరపున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు.
Andhrapradeshh: రాజమండ్రి అర్బన్, రూరల్ ప్రాంతాలలో ఇసుక అక్రమ మైనింగ్‌పై హైకోర్ట్ సీరియస్ అయ్యింది. దీనిపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని రాజమండ్రి పోలీసు కమీషనర్‌కు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సీల్డ్ కవర్లో అక్రమ మైనింగ్‌పై నివేదిక సమర్పించాలని కమీషనర్‌కు ఆదేశించింది.
Andhrapradesh: భూ యాజమాన్య హక్కు చట్టంపై ఏపీ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. క్రింద కోర్ట్లు స్థిరాస్తి దావాలను వెంటనే స్వీకరించాలని ఆదేశించింది. భూ యాజమాన్య హక్కు చట్టంపై ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, బార్ కౌన్సిల్, కర్నూల్ బార్ అసోసియేషన్ వేసిన పిల్స్‌పై బుధవారం హైకోర్ట్‌లో విచారణ జరిగింది.
Andhrapradesh: తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ మొబైల్ ఫోన్ తీసుకుని పోలీసులు బెదిరించడంపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. మంగళవారం కిరణ రాయల్ వేసిన పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తన మొబైల్ ఫోన్ డాటాను మార్ఫింగ్ చేసి విడుదల చేస్తామని బెదిరిస్తున్నారని కిరణ్ రాయల్ పేర్కొన్నారు. మంత్రి రోజా, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడితే డాటా విడుదల చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారని పిటీషన్లో తెలిపారు.