AP NEWS: మరోసారి ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం .. కారణమేంటంటే..?
ABN , Publish Date - Jan 25 , 2024 | 10:49 PM
ఎట్టకేలకు ఉన్నత విద్యాశాఖ దిగివచ్చింది. బీఈడీ కళాశాలలో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తూ విద్యాశాఖ అధికారులు తనిఖీలను సాకుగా చూపుతున్నారు. దీనిపై ఏపీ హైకోర్టును బీఈడీ కళాశాలల సంఘం ఆశ్రయించింది.
అమరావతి: ఎట్టకేలకు ఉన్నత విద్యాశాఖ దిగివచ్చింది. బీఈడీ కళాశాలలో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తూ విద్యాశాఖ అధికారులు తనిఖీలను సాకుగా చూపుతున్నారు. దీనిపై ఏపీ హైకోర్టును బీఈడీ కళాశాలల సంఘం ఆశ్రయించింది. వారి తరఫున హైకోర్టు న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ కోర్టులో వాదనలు వినిపించారు. హైకోర్టు ఉత్తర్వులతో రాష్ట్ర ఉన్నత విద్య మండలికి తక్షణమే కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అధికారులు కావాలనే కాలయాపన చేస్తుండడంపై వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. హైకోర్టు అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత అధికారులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.