Share News

Raghurama: సంక్రాంతికి ఊరొస్తా రక్షణ కల్పించండి.. హైకోర్టులో రఘురామ పిటిషన్

ABN , Publish Date - Jan 11 , 2024 | 05:38 PM

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ( MP Raghuramakrishna Raju ) ఏపీ హైకోర్టు ( AP High Court ) లో గురువారం నాడు పిటీషన్ వేశారు. సంక్రాంతి పండుగకు తమ ఊరు వచ్చేందుకు తనకు రక్షణ కల్పించాలని రఘురామ పిటీషన్‌లో తెలిపారు.

Raghurama: సంక్రాంతికి ఊరొస్తా రక్షణ కల్పించండి.. హైకోర్టులో రఘురామ పిటిషన్

అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ( MP Raghuramakrishna Raju ) ఏపీ హైకోర్టు ( AP High Court ) లో గురువారం నాడు పిటీషన్ వేశారు. సంక్రాంతి పండుగకు తమ ఊరు వచ్చేందుకు తనకు రక్షణ కల్పించాలని రఘురామ పిటీషన్‌లో తెలిపారు. పోలీసులు తనపై 11 కేసులు పెట్టారని, మరో కేసు పెట్టే అవకాశం ఉందని పిటీషన్‌లో పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు తరపున ఏపీ హైకోర్టు ( AP High Court ) లో న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. గతంలో సీఐడీ అధికారులు రఘురామరాజును అరెస్టు చేసి చిత్ర హింసలకు గురి చేశారని హైకోర్టుకు ఉమేష్ చంద్ర తెలిపారు.

తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందని, అందువల్ల పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అర్నేష్ కుమార్ కేసులో 41ఏ నిబంధనలను పాటించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయవాది హైకోర్టులో ప్రస్తావించారు. పోలీసులు రఘురామకృష్ణరాజుపై నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే రఘురామకృష్ణరాజు పిటీషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వాదించారు. రఘురామపై కేసు నమోదై, అది ఏడేళ్ల లోపు శిక్ష ఉన్న సెక్షన్లు అయితేనే 41 ఏ నిబంధనలు వర్తిసాయని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టులో పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజుపై ఏపీ ప్రభుత్వం తాజాగా ఎలాంటి కేసులు పెట్టలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఉత్తర్వులను రేపు ఇస్తామని హైకోర్టు వెల్లడించింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 11 , 2024 | 05:55 PM