Home » AP New Cabinet
ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రేపు(బుధవారం) సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈరోజు సెక్రటేరియట్‌కు వెళ్లిన పవన్ తన చాంబర్‌ను చూడటం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను పరిచయం చేసుకున్నారు.
గంజాయి నిర్మూలనకు విశాఖ పోలీస్ అధికారులు వందరోజుల ప్రణాళిక సిద్ధం చేశారు. ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఆదేశాలతో, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులతో విశాఖ జిల్లా పోలీసులు గంజాయి రవాణాపై అలెర్ట్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఈ నెల12 వ తేదీన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
సుదీర్ఘ కసరత్తు జరిపిన సీఎం చంద్రబాబు.. తన సహచర మంత్రుల కు శాఖలు కేటాయించారు. అందరూ ఊహించినట్లే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి హోదా కట్టబెట్టారు. కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ
ఆంధ్రప్రదేశ్ హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు హౌసింగ్, పౌర సంబంధాల శాఖ బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని అన్నారు. తనకు మంత్రిగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.
ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం..
వలంటీర్ వ్యవస్థపై మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పెన్షన్ అందిస్తామని అన్నారు. వలంటీర్లతో రాజీనామా చేయించి జగన్ రోడ్డున పడేశారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లోని సచివాలయంలో ఈరోజు(గురువారం) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే చేశారు.
అరకులోయ పార్లమెంట్ స్థానంలో సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ (Telugu Desam) ఎమ్మెల్యేగా విజయం సాధించిన గుమ్మిడి సంధ్యారాణికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడం పట్ల కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు...
పార్టీలోని కొత్త తరాన్ని అధికార అందలమెక్కించేలా చంద్రబాబు తన బృందాన్ని ఎంపిక చేసుకున్నారు. సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే కొత్త తరానికి కేబినెట్లో అధిక స్థానాలు కేటాయించారు.