Share News

AP Assembly: ఈనెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ABN , Publish Date - Jun 15 , 2024 | 08:50 PM

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఈ నెల12 వ తేదీన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

AP Assembly: ఈనెల 19  నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
AP Assembly

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పనులు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఈ నెల12 వ తేదీన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. 13న సచివాలయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. 14న మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ (AP Assembly) సమావేశాల నిర్వహణకు కొత్తప్రభుత్వం సిద్ధమవుతోంది.


ఈ నెల 18న కేబినెట్‌ తొలి సమావేశం జరపాలని నిర్ణయించింది. 19వ తేదీ నుంచే అసెంబ్లీ సమావేశాలు ఏపీ ప్రభుత్వం నిర్వహించనున్నది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల నాటికి ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి, పోలీసు హింస, లాక్ అప్ డెత్, అధికార దుర్వినియోగం, పోలీసుల పక్షపాత వైఖరి తదితర అంశాలపై పూర్తి సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఆయా ఎస్పీలు, సీపీలకు ప్రభుత్వం లేఖలు రాసింది.

Updated Date - Jun 15 , 2024 | 09:01 PM