Share News

AP Govt: గంజాయి నిర్మూలనకు వందరోజుల ప్రణాళిక

ABN , Publish Date - Jun 18 , 2024 | 07:19 PM

గంజాయి నిర్మూలనకు విశాఖ పోలీస్ అధికారులు వందరోజుల ప్రణాళిక సిద్ధం చేశారు. ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఆదేశాలతో, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులతో విశాఖ జిల్లా పోలీసులు గంజాయి రవాణాపై అలెర్ట్ అయ్యారు.

AP Govt: గంజాయి నిర్మూలనకు వందరోజుల ప్రణాళిక

విశాఖపట్నం: గంజాయి నిర్మూలనకు విశాఖ పోలీస్ అధికారులు వందరోజుల ప్రణాళిక సిద్ధం చేశారు. ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఆదేశాలతో, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులతో విశాఖ జిల్లా పోలీసులు గంజాయి రవాణాపై అలెర్ట్ అయ్యారు. గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామని విశాఖ వెస్ట్ జోన్ డీసీపీ మోకా సత్తిబాబు హెచ్చరించారు. విశాఖ డీసీపీ కార్యాలయంలో మోకా సత్తిబాబు ఈరోజు(మంగళవారం) మీడియా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఇక నుండి జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ పై తనిఖీలు నిర్వహించి, మాదక రహిత కేంద్రంగా విశాఖ జిల్లాను ఉంచుతామని ఉద్ఘాటించారు. 24 గంటలు పెందుర్తి సరిపిళ్లి వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని అన్నారు. కళాశాలలో తనిఖీలు నిర్వహించి, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థులకు మానసిక వైద్యులతో, తరగతులు నిర్వహిస్తామని అన్నారు. గతంలో కూరగాయల మాటన గంజాయి తరలింపును దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్‌ఫోర్ట్ వాహనాలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు.


నగరంలో ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో 5 నుంచి 10 ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ డ్రగ్స్ మాఫియాను 100 రోజుల్లో గంజాయి వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. గంజాయి వినియోగంపై ఎవరైనా సమాచారం ఇస్తే, వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు, పోలీసు శాఖ నుంచి వారికి పారితోషికం ఇస్తామని విశాఖ వెస్ట్ జోన్ డీసీపీ మోకా సత్తిబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Nara Bhuvaneshwari: అద్భుతమైన ప్రజాతీర్పుతో ప్రజాపాలన మొదలు

Nadendla Manohar: అక్రమార్కులను ఎవరిని వదలిపెట్టం.. మంత్రి నాదెండ్ల వార్నింగ్

Pawan Kalyan: నాదెండ్ల ఓకే.. పవన్ ఏమంటారో..!!

TDP: జగన్‌ రెడ్డి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారు: మంత్రి అనగాని

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 18 , 2024 | 08:26 PM