AP Govt: వైఎస్సార్ రైతు భరోసా పథకం పేరు మార్పు..
ABN , Publish Date - Jun 25 , 2024 | 06:50 PM
ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పథకాలకు మార్పులు చేస్తోంది. తాజాగా వైఎస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) పథకం పేరును.. "అన్నదాత సుఖీభవ" గా (Annadata Sukhibhava) మార్చింది.
అమరావతి: ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పథకాలకు మార్పులు చేస్తోంది. తాజాగా వైఎస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) పథకం పేరును.. "అన్నదాత సుఖీభవ" గా (Annadata Sukhibhava) మార్చింది. దానికి అనుగుణంగా వెబ్ సైట్‌లో మార్పులు చేపట్టింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పుడు 20,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కేంద్రం వాటా రూ. 6000 , రూ.14,000 రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేస్తుంది. అయితే గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో 13,500 రూపాయల ఆర్థిక సాయం ఇస్తుంది. అందులో కేంద్రం వాటా రూ. 6000 , రూ. 7,500ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది.