Home » AP Police
పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకు వస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) తెలిపారు.చంద్రబాబు పాలన అంటేనే శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో ఉంటాయనే నమ్మకం ప్రజల్లో ఉందని అన్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా బెజవాడ మొత్తం పోలీసుల అష్టదిగ్బంధనంలో ఉంది. వారధి, ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి విజయవాడలోకి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. వారధి వద్ద గుంటూరు వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అదే విధంగా గుంటూరులోనే జాతీయ రహదారి పైకి వాహనాలను అనుమతించడం లేదు.
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఉదయం నుంచే వాహనాలను అడ్డుకుంటూ పోలీసులు హడావుడి చేస్తున్నారు. విజయవాడలోకి రాకుండా వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కనకదుర్గ వారధిపై బారికేడ్లు అడ్డు పెట్టి పూర్తిగా పోలీసులు ట్రాఫిక్ జామ్ చేశారు. అంబులెన్స్ లను సైతం పోలీసులు వదలడం లేదు.
గత ఐదేళ్లు ఏపీలో విధ్వంసం సృష్టించిన వైఎస్సార్సీపీ (YSRCP) మూకలు మళ్లీ రెచ్చిపోయారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ మూకలు దాడులు చేస్తునే ఉన్నారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ వర్గీయులు బరి తెగిస్తున్నారు.
'దిశ దివ్యాంగ్ సురక్ష' కు (Disha-Divyang Suraksha) బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిని నియమించారు. ఈ మేరకు విశాఖలోని బీచ్ రోడ్డులో వైజాగ్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నేడు(శనివారం) 'దిశ దివ్యాంగ్ సురక్ష' కార్యక్రమం నిర్వహించారు.
గత ఐదేళ్లు ప్రభుత్వాన్ని నడుపుతూ.. రాజకీయ ప్రత్యర్థులపై ఎన్నో కుట్రలకు తెరలేపారన్న విమర్శలు వైసీపీ అధినేత జగన్ మూటగట్టుకున్నారు. ఎన్నికల ముందు కూడా అధికారాన్ని, అధికారులను అడ్డం పెట్టుకుని ఎన్నో కుట్రలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
సిట్ కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు గల్లంతు అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన వెంటనే ఎందుకైనా మంచిదని అధికారులు సర్దేసినట్టు సమాచారం. స్కిల్ కేసుతో సంబంధమున్న మరి కొన్ని కేసుల్లో ఫైళ్లు మాయం చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసులో డబ్బు చేతులు మారినట్టు ఆధారాలు ఎక్కడున్నాయని హైకోర్ట్ ప్రశ్నించింది.
మర్యాద పూర్వక భేటీ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు వైసీపీ ఖాకీలుగా పేరుతెచ్చుకున్న అధికారులు యత్నాలు సాగిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ తరుణంలో ఆయనను కలవాలని పలువురు అధికారులు యత్నిస్తున్నారు. వీరి ప్రయత్నాలకు మరో ఆలోచన, చర్చ లేకుండా టీడీపీ అధిష్టానం తిరస్కరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లో జూన్ 4న ఓట్ల కౌంటింగ్(Counting of Votes) సందర్భంగా జిల్లా పోలీసులు(Palnadu Police) అప్రమత్తం అయ్యారు. ఎన్నికల రోజు, తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మంగళగిరిలోని ఎన్డీఆర్ భవన్కు సోమవారం వచ్చారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పోలీసులు గౌరవ వందనం పలికారు. ‘జై చంద్రబాబు.. సీఎం చంద్రబాబు’ అంటూ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.