Share News

AP News:కర్నూలు జిల్లాలో మళ్లీ రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..?

ABN , Publish Date - Jun 09 , 2024 | 09:30 PM

గత ఐదేళ్లు ఏపీలో విధ్వంసం సృష్టించిన వైఎస్సార్సీపీ (YSRCP) మూకలు మళ్లీ రెచ్చిపోయారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ మూకలు దాడులు చేస్తునే ఉన్నారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ వర్గీయులు బరి తెగిస్తున్నారు.

AP News:కర్నూలు జిల్లాలో మళ్లీ రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..?

కర్నూలు: గత ఐదేళ్లు ఏపీలో విధ్వంసం సృష్టించిన వైఎస్సార్సీపీ (YSRCP) మూకలు మళ్లీ రెచ్చిపోయారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ మూకలు దాడులు చేస్తునే ఉన్నారు. ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ వర్గీయులు బరి తెగిస్తున్నారు.


కర్నూలు జిల్లాలో హైటెన్షన్..

కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి పల్లెలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కీలక నేత గిరినాథ్ చౌదరిని (Girinath chowdary) వైసీపీ మూకలు దారుణంగా హత్య చేశాయి.వేట కొడవళ్లతో వైసీపీ అల్లరి మూకలు నరికి చంపేశాయి. అయితే వెల్దుర్తి మండలంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీకి చెందిన గౌరీనాథ్ చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. వేట కొడవళ్లతో వైసీపీ వర్గీయులు వేట కొడవళ్లతో హత్య చేశారు. వైసీపీ పార్టీకి చెందిన పామయ్య,రామకృష్ణ తదితరులు వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.


గ్రామంలో హత్య జరగడంతో బొమ్మిరెడ్డి పల్లె గ్రామస్థులు ఉలిక్కి పడ్డారు.ఎన్నికలు పూర్తయిన వారం కాక మునుపే హత్య జరగడంతో మండలంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఇంకా వైసీపీ నేతలకు సహకరిస్తున్నారని పెద్దఎత్తున ఆరోపణలు చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు.


నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పై స్థాయి అధికారులు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. టీడీపీ నేతల డిమాండ్‌తో కర్నూలు జిల్లా పోలీసులు విచారణ చేపట్టి వారికి హామీని ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బొమ్మిరెడ్డి పల్లె గ్రామాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ సందర్శించారు. గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు పికటింగ్ ఏర్పాటు చేశారు. హత్య జరగడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Updated Date - Jun 09 , 2024 | 10:17 PM