Home » Army
దేశ భద్రతే ప్రథమ కర్తవ్యంగా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 15 సముద్ర గస్తీ విమానాలు కొనుగోలుకు ఆమోదం తెలిపింది. నావికా దళానికి తొమ్మిది, తీర రక్షక దళానికి ఆరు సముద్ర గస్తీ విమానాలు కేటాయించింది.
Republic Day 2024 parade dazzled by cultural extravaganza celebrating 'women power' with pride Naik
దేశ భద్రతే ధ్యేయంగా సైనికులు నిత్యం ఎన్ని ఆటంకాలు ఎదురైనా అలుపెరుగని పోరాటం చేస్తుంటారు. అందుకే అంతా వారిని రియల్ హీరోస్ అని పిలుస్తుంటారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే జవాన్లు నిత్యం అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు. అయినా...
ఫైటర్ జెట్ల(Fighter Jets)ను ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న సమస్య రూట్ మ్యాప్. గతంలో కెప్టెన్ అభినందన్ వర్తమాన్(Abinandan Varthaman) రూట్ మ్యాప్ సమస్యే వచ్చి దాయాదుల చేతిలో చిక్కుకున్నారు. పైలట్లు కొండ ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది.
కాంగో రాజధాని బ్రజ్జావిల్లేలో(BRAZZAVILLE)ని స్టేడియంలో చేపట్టిన ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్(Army Recruitment Drive)విషాదాన్ని మిగిల్చింది. నియామకంలో ఒకరిని ఒకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి 31 మంది మృతి చెందినట్లు రిక్రూట్మెంట్ అధికారులు చెప్పారు.
అమెరికా నౌకాదళానికి చెందిన ఓ భారీ నిఘా విమానం సముద్రంలోకి దూసుకెళ్లింది. సముద్రంలో ఒక పడవ మాదిరిగా విమానం తేలియాడింది. అంతపెద్ద విమానం సముంద్రంలో పడవ మాదరిగా తేలియడడాన్ని చూసిన స్థానికులు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మణిపుర్(Manipur) లో ఈ ఏడాది ప్రథామార్థంలో కుకీ, మైతేయి తెగల మధ్య జరిగిన హింస దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. అయితే ఈ ఘర్షణల్లో దుండగులు హింసకు పాల్పడటానికి వివిధ మార్గాల్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చుకున్నారు. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతంలో హింస చల్లారుతున్న క్రమంలో భద్రతా బలగాలు 3 సర్చ్ ఆపరేషన్లు నిర్వహించి వెపన్స్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
సిక్కింలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) వల్ల సంభవించిన ఆకస్మిక వరదల్లో(Floods) తప్పిపోయిన వారి మృతదేహాలు పదులు సంఖ్యలో బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 55 మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సుపై బుధవారం క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన వరద విపత్తలో 22 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఆకస్మిక వరదల్లో నలుగురు సైనికులతో సహా 19 మంది మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. 100 మందికి పైగా తప్పిపోయారు. సహాయక చర్యలు చేపట్టిన భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు తీస్తా నదీ పరీవాహక ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నాయి. అయితే వాతావరణం అనుకూలించపోవడంతో పరిస్థితి ప్రతికూలంగా మారింది.
ఈశాన్య రాష్ట్రం సిక్కింను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అతలాకూతలం అయింది. ఈ వర్షాల వల్ల వరదలు సంభవించడంతో 23 మంది భారత ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు.