Share News

BRAZZAVILLE: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో తొక్కిసలాట.. 31 మంది మృతి

ABN , First Publish Date - 2023-11-22T10:07:57+05:30 IST

కాంగో రాజధాని బ్రజ్జావిల్లేలో(BRAZZAVILLE)ని స్టేడియంలో చేపట్టిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్(Army Recruitment Drive)విషాదాన్ని మిగిల్చింది. నియామకంలో ఒకరిని ఒకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి 31 మంది మృతి చెందినట్లు రిక్రూట్మెంట్ అధికారులు చెప్పారు.

BRAZZAVILLE: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో తొక్కిసలాట.. 31 మంది మృతి

కాంగో: కాంగో రాజధాని బ్రజ్జావిల్లేలో(BRAZZAVILLE)ని స్టేడియంలో చేపట్టిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్(Army Recruitment Drive)విషాదాన్ని మిగిల్చింది. నియామకంలో ఒకరిని ఒకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగి 31 మంది మృతి చెందినట్లు రిక్రూట్మెంట్ అధికారులు చెప్పారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రజ్జావిల్లేలోని ఓర్నానో స్టేడియంలో నవంబర్ 14 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టారు. రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పని చేసే 18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల యువకులు సైన్యంలో చేరాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 1500 ప్రాంతాల్లో ఈ డ్రైవ్ చేపడుతుండగా.. ఓర్నావో స్టేడియంలో వేల సంఖ్యలో అభ్యర్థులు బారులు తీరేవారు.


కానీ రోజుకి 700 మంది అభ్యర్థుల వివరాలే లిస్ట్ లో నమోదు చేసేవారు. వేల సంఖ్యలో వచ్చే అభ్యర్థులను పోలీసులు అదుపు చేయలేకపోవడంతో తొక్కిసలాటకు కారణమైంది. ఈ ఘటనలో ఒకరిపై ఒకరు పడి 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. దీంతో బ్రజ్జావిల్లేలో చేపట్టిన రిక్రూట్మెంట్ ని తాత్కాలికంగా నిలిపేసినట్లు కాంగో ఆర్డ్మ్ ఫోర్సెస్ కమాండ్ ప్రకటించింది. అయితే ఘటన జరిగిన రోజు నియామక ప్రక్రియ ఫైనల్ డే కావడంతో రద్దీ మరింతగా పెరిగి.. ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

కొందరు లైన్లలో నిల్చొని అసహనానికి గురయ్యి. బలవంతంగా లోపలికి ప్రవేశించారని, దీంతో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. ఘటనపై విచారణ జరిపి.. బాధితుల వివరాలు బయటపెట్టాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. కాంగో ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడంతో విఫలమవడంతోనే ఘటన జరిగిందని.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రతిపక్ష నేత ఒకరు డిమాండ్ చేశారు. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం.. కాంగోలో నిరుద్యోగ రేటు 42 శాతం. చమురు ఉత్పత్తి చేసే దేశం అయినప్పటికీ 5.61 మిలియన్ల మంది పేదరికంలో మగ్గుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 15 శాతం మందికే విద్యుత్ సదుపాయం అందుబాటులో ఉంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-11-22T10:07:58+05:30 IST