Indian Navy: 15 సముద్ర గస్తీ విమానాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం | Ministry of Defense approves purchase of 15 maritime patrol aircraft Naik
Share News

Indian Navy: 15 సముద్ర గస్తీ విమానాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం

ABN , Publish Date - Feb 16 , 2024 | 06:00 PM

దేశ భద్రతే ప్రథమ కర్తవ్యంగా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 15 సముద్ర గస్తీ విమానాలు కొనుగోలుకు ఆమోదం తెలిపింది. నావికా దళానికి తొమ్మిది, తీర రక్షక దళానికి ఆరు సముద్ర గస్తీ విమానాలు కేటాయించింది.

Indian Navy: 15 సముద్ర గస్తీ విమానాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం

దేశ భద్రతే ప్రథమ కర్తవ్యంగా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 15 సముద్ర గస్తీ విమానాలు కొనుగోలుకు ఆమోదం తెలిపింది. నావికా దళానికి తొమ్మిది, తీర రక్షక దళానికి ఆరు సముద్ర గస్తీ విమానాలు కేటాయించింది. ఈ ప్రతిపాదనలో పేర్కొన్న విమానాలు ఇండియాలోనే తయారవుతుండటం విశేషం. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ వీటిని తయారు చేస్తోంది. C-295 విమానాల ఆధారంగా వీటిని రూపొందిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా చొరవతో స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ విమానాల్లో రాడార్లు, సెన్సార్లు ఉంటాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్ (CABS) ద్వారా వీటిని నిర్వహించనున్నారు. భారత వైమానిక దళం (IAF) ఇటీవల స్పెయిన్‌లో తయారు చేసిన మొదటి C-295 విమానాన్ని ప్రవేశపెట్టింది. 16 ఫ్లై-అవే కండిషన్‌లో స్పెయిన్ నుంచి రానున్నాయి. మిగతా 40 గుజరాత్‌లోని వడోదరలోని టాటా ఫెసిలిటీలో భారతదేశంలో తయారవుతాయి.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Feb 16 , 2024 | 06:01 PM