Home » Arrest
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని 'ఆప్' చెబుతోంది. మరోవైపు, నైతిక బాధ్యత వహించి కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే, కేజ్రీవాల్‌ను జైలుకు పంపితే అక్కడ్నించే ఆయన పాలన సాగించవచ్చా అనేదే ప్రశ్న? ఇక్కడ చట్టం ఏమి చెబుతోందనే దానిపై విశ్లేషణ జరుగుతోంది.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జ్యుడీషియల్ కస్టడీని పెంచుతూ రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన రాహుల్.. అధైర్యపడొద్దని, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
పాము విషం-రేవ్ పార్టీ కేసులో బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ ఆదివారం అరెస్టయ్యాడు. అతన్ని శనివారం విచారణకు హాజరుకాగా.. ఈ క్రమంలోనే అతన్ని అరెస్ట్ చేశారు. త్వరలోనే ఎల్వీష్‌ను కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
దిల్లీ మద్యం కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఉదయం నుంచి సుదీర్ఘ సోదాల అనంతరం ఈడీ అధికారులు కవితను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు.
MLC Kavitha Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు ఈడీ, ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాల అనంతరం కవితను అరెస్ట్ చేయడం జరిగింది.
సంగారెడ్డి జిల్లా: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే కారణంతో మధుసూదన్ రెడ్డిని పటాన్ చెరు పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసుకోవడం సాధారణమే..! ప్రణీత్‌రావు ఏకంగా ఎస్ఐబీ కేంద్రంగా పలు జిల్లాల్లో వార్‌రూమ్‌లను ఏర్పాటు చేశారని పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు.. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు.
విజయవాడ: మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను అరెస్టు చేసిన పోలీసులు అర్ధరాత్రి న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. రిమాండ్‌పై రెండు గంటల పాటు వాదనలు కొనసాగాయి. ప్రాసిక్యూషన్ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ.. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.
ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నలుగురు నిందితులను ఎస్ఓజీ నిఘా సెల్, ఎస్టీఎఫ్ యూనిట్ గోరక్‌పూర్, ఇటావా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి అభ్యర్థుల మార్కుల షీట్లు, అడ్మిట్ కార్డులు, బ్లాంక్ చెక్‌లు, మొబల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.