Share News

UP paper leak case: పేపరు లీకేజీ కేసులో కీలక పరిణామం, నలుగురు నిందితుల అరెస్టు

ABN , Publish Date - Feb 28 , 2024 | 08:30 PM

ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నలుగురు నిందితులను ఎస్ఓజీ నిఘా సెల్, ఎస్‌టీఎఫ్ యూనిట్ గోరక్‌పూర్, ఇటావా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి అభ్యర్థుల మార్కుల షీట్లు, అడ్మిట్ కార్డులు, బ్లాంక్ చెక్‌లు, మొబల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

UP paper leak case: పేపరు లీకేజీ కేసులో కీలక పరిణామం, నలుగురు నిందితుల అరెస్టు

లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ పేపర్ లీక్ కేసు (UP paper leak case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నలుగురు నిందితులను ఎస్ఓజీ నిఘా సెల్, ఎస్‌టీఎఫ్ యూనిట్ గోరక్‌పూర్, ఇటావా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి అభ్యర్థుల మార్కుల షీట్లు, అడ్మిట్ కార్డులు, బ్లాంక్ చెక్‌లు, మొబల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.


యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై దుమారం రేపడంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ పరీక్షలను రద్దు చేసింది. ఆరు నెలల్లో తిరిగి పరీక్షలకు ఆదేశించారు. పేపర్ లీకేజీలకు పాల్పడుతూ యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న వారిని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హెచ్చరించారు. ఫిబ్రవరి 16,17 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలకు 48 లక్షల మంది హాజరయ్యారు.

Updated Date - Feb 28 , 2024 | 08:30 PM