Home » Ashok Gehlot
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారంనాడు ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఐదు హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించేందుకు చట్టం చేస్తామని ప్రకటించారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని వేధించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను బీజేపీ ఉసిగొలుపుతోందని, రాష్ట్రంలో ఈడీ నిరంతర దాడులే కాంగ్రెస్ సాధించబోయే విజయాన్ని చెప్పకనే చెబుతున్నాయని విశ్లేషించారు.
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రాజస్థాన్ ఎన్నికల పోరులో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌లను...
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం విడుదల చేసింది. 33 మంది అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన నియోజకవర్గాలను ఈ జాబితాలో ప్రకటించింది. సర్దార్‌పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అశోక్ గెహ్లాట్ పోటీ చేయనుండగా, టోంక్ నుంచి సచిన్ పైలట్ పోటీ చేస్తున్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలని అనుకుంటున్నానని, కానీ ఆ పదవి నన్ను విడిచిపెట్టడం లేదని అన్నారు. తన ప్రధాన ప్రత్యర్థి సచిన్ పైలట్‌ని...
వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు కీలకంగా భావిస్తున్న అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో కులాలవారీ సర్వే జరిపించే అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుంటోంది. బీహార్ తరహాలోనే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కులగణన జరుపుతామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలను (Three new districts) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కొత్త మాల్‌పుర, సుజన్‌గఢ్, కుచమాన్ సిటీ జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
రాజస్థాన్‌లో అధికార పార్టీ కాంగ్రెస్‌లోని అంతర్గత పోరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను పదవి నుంచి దింపడానికి సగం మంది కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాజస్థాన్ (Rajasthan)లోని కోటా(Kota)లో విద్యార్థుల వరుస సూసైడ్స్ వెనక ప్రేమ వ్యవహారాలు ఉన్నట్లు పేర్కొన్న ఆ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్ వ్యాఖ్యలను పేరెంట్స్ ఖండిస్తున్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు చేదు అనుభవం ఎదురైంది. బాబా శ్రీ ఖిన్వదాస్ జీ మహరాజ్ వర్దంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు సికార్‌లోని సాంగ్లియా పీఠానికి ఆయన వెళ్లాల్సి ఉండగా ఆయన హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరించారు. గగనతల ఆంక్షల పేరుతో తన హెలికాప్టర్‌కు హోం మంత్రిత్వ శాఖ అనుమతించ లేదంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే, ఆయన వాదనను హోం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది.