Home » Asia cup 2023
సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య బంధం అందరినీ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో వికెట్ తీసిన ప్రతీసారి రోహిత్, విరాట్ కోహ్లీ ఒకరినొకరు హత్తుకున్నారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత చురుకుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉత్సాహంగా కనబడుతూ ఆటకు 100 శాతం న్యాయం చేస్తాడు.
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ను టీమిండియా ఫిక్స్ చేసిందని కొందరి నుంచి తనకు వచ్చిన సందేశాలు, మీమ్స్‌పై పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు షోయబ్ అక్తర్ ఘాటుగా స్పందించాడు.
అంతర్జాతీయ వన్డేల్లో 150 వికెట్ల మైలురాయిని కుల్‌దీప్ అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత స్పిన్ బౌలర్‌గా అతడు రికార్డు సాధించాడు.
ఆసియా కప్ 2023లో టీమిండియా ఫైనల్‌లో అడుగుపెట్టింది. సూపర్ 4లో వరుసగా పాకిస్థాన్, శ్రీలంకను ఓడించిన రోహిత్ సేన మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. మిగత జట్ల కంటే ముందుగానే ఫైనల్‌లో అడుగుపెట్టింది.
ఆసియా కప్ 2023లో రాణిస్తున్న టీమిండియా బ్యాటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సత్తా చాటారు.
శ్రీలంక స్పిన్నర్లు దునిత్ వెల్లలాగే(5/40), చరిత్ అసలంక(4/14) భారత బ్యాటర్లను వణికించారు. ముఖ్యంగా టాపార్డర్‌ను 20 ఏళ్ల వెల్లలాగే కుప్పకూల్చాడు.
ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమైనప్పటికీ హిట్‌మ్యాన్ మాత్రం హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఆసియా కప్‌లో కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 67 పరగులు చేసిన బ్యాటర్లు ఆ తర్వాత తడబాటుకు గురయ్యారు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో స్పిన్నర్లకు దాసోహం అయ్యారు.
ఆసియా కప్‌లో టీమిండియా మ్యాచ్‌కు మరోసారి వర్షం అడ్డుగా నిలిచింది. సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది.