Home » Asia cup 2023
నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 6 ఫోర్లు, 5 సిక్సులతో 59 బంతుల్లోనే 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ 6 రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు.
పాకిస్థాన్‌పై 103 పరుగులకే ఆలౌటైన నేపాల్ టీమిండియాపై మాత్రం గౌరవప్రదమైన ప్రదర్శన చేసింది. 50 ఓవర్లు ఆడాలని పట్టుదల ప్రదర్శించింది. కానీ చివరకు 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది.
సూపర్-4లో అడుగుపెట్టాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అటు టీమిండియా, ఇటు నేపాల్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే నేపాల్ ఓపెనర్లు ఇచ్చిన సులభమైన మూడు క్యాచ్‌లను మన ఆటగాళ్లు నేలపాలు చేశారు.
ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరడంలో ఆ జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రధాన పాత్ర పోషించాడు. 17 మ్యాచ్‌లు ఆడి 890 పరుగులు చేశాడు. అతడు ఇదే జోరు కొనసాగిస్తే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా టైటిల్ విజేతగా నిలవడం పెద్ద కష్టమేమీ కాదని అందరూ అభిప్రాయపడ్డారు. దీంతో సెలక్టర్లు కూడా మూడు ఫార్మాట్లలోనూ అతడికి అవకాశాలు కట్టబెట్టారు. అయితే దాదాపు రెండు నెలలు గడిచిన తర్వాత సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది.
ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్ భారీ తేడాతో ఓటమి పాలైంది. దీంతో టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా తమ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు అర్ణ బీర్ కంపెనీ నజరానా ప్రకటించింది.
నేపాల్‌తో కీలకమైన మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ వేయగా నేపాల్ కెప్టెన్ రోహిత్ పాడెల్ టేల్స్ చెప్పాడు.
టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. అతని భార్య సంజనా గణేషన్ పండటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బుమ్రా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ఆసియాక్‌పలో(Asia cup) తమ చివరి గ్రూప్ మ్యాచ్‌నకు టీమిండియా(Team India) సిద్ధమైంది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి పోరుకు వరుణుడు అడ్డుపడడంతో ఎలాంటి ఫలితం తేలకపోగా ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. దీంతో ఇదివరకే నేపాల్(Nepal)పై విజయం సాధించిన పాక్ మూడు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ నుంచి సూపర్-4(Super-4)కు అర్హత సాధించింది.
ఆసియా కప్ 2023లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నేపాల్‌తో మ్యాచ్‌కు దూరంగా కానున్నాడని సమాచారం.
ఆసియా కప్ 2023లో టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. సూపర్ 4 చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సోమవారం నేపాల్‌తో రోహిత్ సేన తలపడనుంది.