Jasprit Bumrah: తండ్రైన టీమిండియా పేస్ గన్ బుమ్రా.. అప్పుడే పేరు కూడా పెట్టేశాడు! | Team india Pacer Jasprit Bumrah, Wife Sanjana Ganesan Blessed With Baby Boy vrv

Jasprit Bumrah: తండ్రైన టీమిండియా పేస్ గన్ బుమ్రా.. అప్పుడే పేరు కూడా పెట్టేశాడు!

ABN , First Publish Date - 2023-09-04T13:50:10+05:30 IST

టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. అతని భార్య సంజనా గణేషన్ పండటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బుమ్రా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

Jasprit Bumrah: తండ్రైన టీమిండియా పేస్ గన్ బుమ్రా.. అప్పుడే పేరు కూడా పెట్టేశాడు!

ముంబై: టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా తండ్రయ్యాడు. అతని భార్య సంజనా గణేషన్ పండటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బుమ్రా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాకుండా తమ కొడుకుకు బుమ్రా దంపతులు అప్పుడే పేరు కూడా పెట్టేశారు. తమ కుమారుడికి అంగద్ జస్ప్రీత్ బుమ్రా అని నామకరణం చేసినట్టు బుమ్రా పేర్కొన్నాడు. ‘‘మా చిన్న కుటుంబం పెరిగింది. మా హృదయాలు మేము ఊహించిన దానికంటే నిండుగా ఉన్నాయి! ఈ ఉదయం మేము మా లిటిల్ బాయ్ అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ఈ ప్రపంచంలోకి స్వాగతించాము. జీవితంలోని ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ’’ అని బుమ్రా పోస్ట్ చేశాడు. దీంతో బుమ్రా దంపతులకు తోటి క్రికెటర్లతోపాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా బుమ్రా-సంజన దంపతులకు 15 మార్చి 2021న వివాహం జరిగింది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఆసియా కప్ 2023లో భాగంగా శ్రీలంకలో ఉన్న బుమ్రా.. భార్య ప్రసవం కారణంగానే ఉన్నపళంగా ఆదివారం భారత్‌కు తిరిగొచ్చాడు. దీంతో బుమ్రా సోమవారం నేపాల్‌తో టీమిండియా ఆడే మ్యాచ్‌కు దూరం కానున్నాడు. టీమిండియా సూపర్ 4లో అడుగుపెడితే మళ్లీ జట్టులో చేరనున్నాడు. కాగా వెన్ను నొప్పి కారణంగా దాదాపు ఏడాదిపాటు జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఐర్లాండ్ పర్యటనతో రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీలో ఆడిన మొదటి సిరీస్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం రాకపోయినప్పటికీ బ్యాటింగ్‌లో జట్టుకు విలువైన పరుగులు జోడించాడు.

Updated Date - 2023-09-04T13:59:02+05:30 IST