India vs Nepal: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్టులో ఒక మార్పు!

ABN , First Publish Date - 2023-09-04T14:45:48+05:30 IST

నేపాల్‌తో కీలకమైన మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ వేయగా నేపాల్ కెప్టెన్ రోహిత్ పాడెల్ టేల్స్ చెప్పాడు.

India vs Nepal: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్టులో ఒక మార్పు!

పల్లెకెలె: నేపాల్‌తో కీలకమైన మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ వేయగా నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ టేల్స్ చెప్పాడు. కానీ టాస్ మాత్రం హెడ్స్ పడింది. దీంతో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్టు తెలిపాడు. వ్యక్తిగత కారణాల దృష్యా జస్ప్రీత్ బుమ్రా ఇండియా వెళ్లాడని, అతని స్థానంలో ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ బరిలోకి దిగుతున్నట్టు రోహిత్ చెప్పాడు. నేపాల్ కూడా ఈ మ్యాచ్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఆరిఫ్ షేక్ స్థానంలో భీమ్ షార్కిని తుది జట్టులోకి తీసుకున్నట్టు నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ చెప్పాడు.


ఇక సూపర్ 4లో అడుగుపెట్టాలంటే ఈ మ్యాచ్‌లో రెండు జట్లకు గెలుపు తప్పని సరి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సూపర్ 4లో అడుగుపెడుతుంది. పాకిస్థాన్‌తో టీమిండియా ఆడిన గత మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం రోహిత్ సేన ఖాతాలో ఒక పాయింట్ ఉంది. పాకిస్థాన్‌తో ఆడిన గత మ్యాచ్‌లో నేపాల్ ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఒక పాయింట్ కూడా లేదు. కాబట్టి ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే టీమిండియాకే సూపర్ 4 బెర్త్ దక్కుతుంది.

తుది జట్లు

నేపాల్: కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్(వికెట్ కీపర్), రోహిత్ పౌడెల్(కెప్టెన్), భీమ్ షర్కి, సోంపాల్ కమీ, గుల్సన్ ఝా, దీపేంద్ర సింగ్ ఐరీ, కుశాల్

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

Updated Date - 2023-09-04T14:49:18+05:30 IST