Home » Asifabad
ఎన్నికల వేళ.. పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలతో పోలింగ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల వద్ద ఈదురుగాలులకు టెంట్లు నేలకూలడంతో పరుగులు పెట్టారు. కొన్ని చోట్ల వర్షంలో తడుస్తూనే పోలింగ్ కేంద్రాలకు తరలిపోయారు. పలుచోట్ల పోలింగ్ కేంద్రాల్లోకి భారీగా వరద నీరు చేరింది.
దేశంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజపీ, ఆర్ఎస్ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి నుంచి ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు చెప్పే సంప్రదాయం ఉందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 2012నుంచి జనాభా లెక్కలు ఎందుకు ఆపేసిందని ప్రశ్నించారు.జనాభాతో పాటు కులగణన జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని అన్నారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈ రోజు (గురువారం నాడు) మూడు జిల్లాల్లో పర్యటిస్తారు. ఆసిఫాబాద్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. హైదరాబాద్ నుంచి నేరుగా సీఎం రేవంత్ ఆసిఫాబాద్ చేరుకుంటారు.
కొమురం భీం: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బెజ్జురు మండలం, పోతేపల్లి సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొన్నాయి.
కుమారుడిని చూడకుండా ఓ తల్లి ఎన్ని రోజులని ఉండగలదు? ఆ తల్లి ఏకంగా మూడున్నరేళ్లు కొడుకును కనీసం చూడలేదు. భర్తతో గొడవపడి, కుమారుడిని కట్టుకున్నోడి వద్దే వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె అడిగినప్పుడల్లా... ‘కొడుకు బాగున్నాడు’ అని చెబుతూ వచ్చాడా భర్త!! విషయం ఏమిటంటే.. ఓ నాటు వైద్యుడి మందుల కారణంగా ఆ బాలుడు ఈ లోకాన్ని వీడి మూడేళ్లు దాటిపోయింది. ఈ ఘోరం కన్నతండ్రిగా తనకు తెలిసినా కూడా అతడు భార్యకు చెప్పలేదు. పైగా...
ఏనుగు జాడ కోసం అటవీ శాఖ గాలింపు నిర్వహిస్తోంది. సులుగు పల్లి - ముంజం పల్లి మధ్యలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రాణహిత ప్రాజెక్టు కాల్వ గుండా ఏనుగు ప్రయాణం సాగుతోందని తెలుసుకున్నారు. బెజ్జురు, చింతల మానే పల్లి, పెంచికల్ పేట, దహెగాం మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
కొమురంభీం: జిల్లాలో ఏనుగు అలజడి సృష్టించింది. చింతల మానేపల్లి మండలం, బూరెపల్లి శివారులో ఏనుగు దాడిలో రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లాలోకి ఏనుగు ప్రవేశించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్నాయ్.. మరికొన్ని గంటల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) అభ్యర్థుల తొలి జాబితాను (BRS First List) రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధమైంది. తమకు ఈసారైనా టికెట్ దక్కకపోతుందా..? అని ఆశావహులు, పక్కాగా టికెట్ మనదేనని సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. జాబితాలో తప్పుకుండా పేరుంటుందని మరికొందరు జంపింగ్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. ఈ క్రమంలో..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్ది చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయ్. అతి త్వరలోనే బీఆర్ఎస్ అభ్యర్థుల (BRS List) తొలి జాబితాను రిలీజ్ చేయాలని భావిస్తున్న గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR).. టికెట్లు ఎవరికైతే ఇవ్వట్లేదో వారిని ప్రగతిభవన్కు పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు...
ఆసిఫాబాద్ జిల్లా: వరదలతో కొమురంబీం ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లక్మాపూర్లో కొడుకు అత్యవసర వైద్యం అందించేందుకు ఆ తండ్రి పెద్ద సాహసం చేశారు. పీకల్లోతు వరదలో ప్రాణాలకు తెగించి ఆస్పత్రికి తీసుకువెళ్లారు.