Home » Assam
సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా మంగళవారం మూడో దశ పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు.
ఆసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వాస్ శర్మ (Himanta Biswa Sarma)అత్యంత అవినీతిపరుడైన నాయకుడని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priaynka Gandhi) అభివర్ణించారు. ఆయన పాలనలో మాఫియా రాజ్యం నడుస్తుందని ఆరోపించారు.
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తారని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ రంగం సంస్థలను మోదీ, అమిత్‌షాలు పారిశ్రామికవేత్తలైన అంబానీ, అదానీలకు అమ్మేస్తున్నారని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ(BJP) సర్కార్ దేశాన్ని నిర్బంధ శిబిరంగా మార్చిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) విమర్శలు గుప్పించారు. అస్సాంలో టీఎంసీ అభ్యర్థులకు మద్దతుగా బుధవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో దీదీ పాల్గొన్నారు.
దేశం మొత్తం ఓట్ల పండుగ జరుగుతోంది. రాజకీయ నాయకులంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎక్కడ ఓటరుంటే అక్కడ నాయకులు వాలిపోతున్నారు. ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనే లెక్కలు తీస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది.
ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు మేనిఫెస్టో ( Manifesto ) ప్రకటిస్తుంటాయి. తాము అధికారంలోకి వచ్చాక చేపట్టనున్న పనులను ముందుగానే ఓటర్లకు వెల్లడిస్తుంటాయి. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తాయి.
అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మకు , ధుబ్రి ఎంపీ, ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ కు మధ్య మాటలు తూటాలు పేలాయి. మీరు కోరుకుంటే మళ్లీ పెళ్లి చేసుకోండి, యూసీసీ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందంటే మాత్రం బహుభార్యాత్వం చట్టవిరుద్ధమవుతుందంటూ బద్రుద్దీన్‌పై శర్మ విసుర్లు విసిరారు.
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశలో 102 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ఈరోజుతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగు స్తుండటంతో.. ఎక్కడ ఎవరు పోటీలో ఉండనున్నరో క్లారిటీ రానుంది.
అసోం నౌబోయిచా సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ చంద్ర. ఇతని సతీమణి రాణి కాంగ్రెస్ నేత, కేంద్రమంత్రిగా పనిచేశారు. రాణికి లోక్ సభ టికెట్ కోసం భరత్ చంద్ర ప్రయత్నించారు. వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో భరత్ చంద్ర కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏక వ్యాఖ్యంతో రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పంపించారు.