Assam: భారీగా డ్రగ్స్ స్వాధీనం
ABN , Publish Date - Dec 22 , 2024 | 01:56 PM
అసోంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోట్ల రూపాయిల్లో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. సోప్ బాక్స్‌ల్లో వీటిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గౌహతి, డిసెంబర్ 22: భారీగా మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న గుట్టును అసోం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. మణిపూర్ నుంచి అసోంకు మాదక ద్రవ్యాలు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా వేసి.. ముమ్మర తనిఖీలు చేపట్టారు. అందులోభాగంగా రూ. 6 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు. అందుకు సంబంధించి.. ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: రాహుల్ గాంధీకి మళ్లీ కోర్టు సమన్లు
Also Read: రాగుల వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
Also Read: చుక్కకూరతో ఇన్ని లాభాలు ఉన్నాయా..?
మణిపూర్‌లోని కంగ్‌పోక్పీ నుంచి అసోంలోని జిల్లాలకు భారీగా మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా జరుగుతోన్నట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఆ క్రమంలో శనివారం రాత్రి కచర్ జిల్లాలో ముర్తాజా అహ్మద్ అలియాస్ భూలుకు ఈ సరుకు అందించినట్లు పోలీసులకు ఉప్పందింది. దాంతో పోలీసులు ముర్తాజా అమ్మద్ వాహనానంలో తనిఖీలు చేపట్టారు. దీంతో 49 సబ్బు బాక్స్‌లల్లో హెరాయిన్ ఉన్నట్లు గుర్తించారు.
Also Read: స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. దొరికిపోయిన విద్యార్థులు
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి
అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరోవైపు ట్రక్ డ్రైవర్ ప్రశాంత్ టాపోను డోక్ మోకాలో అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి భారీగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. అతడు సైతం మణిపూర్ నుంచి అసోంకు హెరాయిన్ అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
Also Read: మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు
Also Read: జర్మనీలో దాడి.. పలువురి మృతి, ఏడుగురు భారతీయులకు గాయాలు
వీరి వద్ద నుంచి మొత్తం 637 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ డ్రగ్స్ విలువ కోట్లలో ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే వీరి వాహనాలను సైతం స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని తెలిపారు. నార్కోటిక్స్ డ్రగ్స్‌కు సంబంధించిన కేసులను వీరిపై నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
For National News And Telugu News