Home » Assembly elections
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పూంచ్ జిల్లాలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, పహరి, గుజ్జర్ కమ్యూనిటీల మధ్య చీలకలు తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని, ఆ పార్టీ యత్నాలు విఫలమవుతాయని అన్నారు.
లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారంనాడు రెండు ర్యాలీల్లో పాల్గొంటారు. కాంగ్రెస్, కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం సాగిస్తారు.
భారతీయ జనతా పార్టీ ఉద్దేశాలపై ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ పాలన కొనసాగించేందుకు హంగ్ అసెంబ్లీనే బీజేపీనే కోరుకుంటోందని ఆరోపించారు. అయితే ప్రజలు అందుకు అంగీకరించరని చెప్పారు.
జైళ్ల నుంచి ఉగ్రవాదులను విడిచిపెట్టాలని విపక్షాలు కోరుకుంటున్నాయనీ, ఏ ఒక్క ఉగ్రవాదని కానీ, రాళ్లు రువ్వే వాళ్లను కానీ జైళ్ల నుంచి తాము విడిచిపెట్టేది లేదని అమిత్‌షా తేల్చిచెప్పారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కల్కా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ చౌదరి కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం సాయంత్రం దాడి చేశారు.
యమునానగర్‌లోని జగాధరి అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ రోడ్‌షో నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం 11 జిల్లాల్లో 13 ర్యాలీల్లో కేజ్రీవాల్ పాల్గోనున్నారు.
జార్ఖాండ్‌లో 2024 ఎన్నికలకు సంబంధించిన బీజేపీ పరివర్తన ర్యాలీని హోం మంత్రి అమిత్‌షా శుక్రవారంనాడు ప్రారంభించారు. ఇక్కడి నుంచి మొదలైన పరివర్తన యాత్ర రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి, ఇంటింటికి చేరుకుంటుందని చెప్పారు.
జమ్ము, కశ్మీర్‌ను రాజకీయంగా, ఆర్థికంగా, భావోద్వేగాల పరంగా అనుసంధానించే వారధి 'దర్బార్ మూవ్' అని ఫరూక్ అబ్దుల్లా గుర్తు చేశారు. ఇందువల్ల రెండు ప్రాంతాల మధ్య ఎలాంటి విభజన ఉండదని, అది ఎంతమాత్రం సరికాదని ఆయన అన్నారు.
జమ్మూకశ్మీర్‌ను తిరిగి ఉగ్రవాదం వైపు నెట్టే ఆలోచనలో కాంగ్రెస్, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఉన్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఉగ్రవాదంపై మెతక వైఖరి ప్రదర్శిస్తాయని విమర్శించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సూచనప్రాయంగా తెలిపారు. రెండు విడతలుగా ఎన్నికలు ఉండవచ్చని అన్నారు.