Share News

Rahul Gandhi: దేశంలో విద్వేషం, హింసను వ్యాప్తి చేస్తున్న బీజేపీ-ఆర్ఎస్ఎస్

ABN , Publish Date - Sep 23 , 2024 | 03:51 PM

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పూంచ్ జిల్లాలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, పహరి, గుజ్జర్ కమ్యూనిటీల మధ్య చీలకలు తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని, ఆ పార్టీ యత్నాలు విఫలమవుతాయని అన్నారు.

Rahul Gandhi: దేశంలో విద్వేషం, హింసను వ్యాప్తి చేస్తున్న బీజేపీ-ఆర్ఎస్ఎస్

న్యూఢిల్లీ: దేశంలో విద్వేషం, హింసను భారతీయ జనతా పార్టీ (BJP), ఆ పార్టీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ (RSS) వ్యాప్తి చేస్తున్నాయని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. వాళ్లు ఎక్కడికి వెళ్లినా కులాలు, మతాలు, రాష్ట్రాలు, భాషల మధ్య విభజనలు తెచ్చి ఘర్షణలను ప్రోత్సహిస్తారంటూ విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పూంచ్ జిల్లాలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, పహారి, గుజ్జర్ కమ్యూనిటీల మధ్య చీలకలు తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని, ఆ పార్టీ యత్నాలు విఫలమవుతాయని అన్నారు.


''ప్రేమతోనే విద్వేషాన్ని అధిగమించగలం. ఒకవైపు విద్వేష వ్యాప్తి చేస్తు్న్నవారు, మరోవైపు ప్రేమను ప్రమోట్ చేస్తున్నవారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అందర్నీ కలుపుకొని వెళ్లి ప్రతి ఒక్కరి హక్కుల కోసం ముందుంటుంది. మాకు అందరూ సమానమే. ఎవరినీ వెనకబడనీయం'' అని రాహుల్ చెప్పారు. జమ్మూకశ్మీర్‌ ప్రజలతో సహా ఎవరు ఏ పని చేయమని తనను అడిగినా అ పని చేయడానికి సిద్ధమని, ఏ సమస్యనైనా పార్లమెంటు ముందు ప్రస్తావించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత విపక్షాల బలం పెరిగిందని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక చట్టాలు, విధానాలకు వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యంగా నిలుస్తాయని భరోసా ఇచ్చారు.

America: భారత్‌కు గుడ్ న్యూస్.. ఆ సంపదను తిరిగిచ్చేస్తున్న అమెరికా..


మోదీలో మునుపటి కాన్ఫిడెన్స్ లేదు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాన్ఫిడెన్స్ కోల్పోయారని, అది ఆయన ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు చాలా ధీమాతో కనిపించేవారని, ఇప్పుడు అది మాయమైందని అన్నారు. కేంద్రంపై విసుర్లు గుప్పిస్తూ, కేంద్ర పాలిత ప్రాంతాలు అడపాదడపా రాష్ట్రాలు కావడం, రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలుగా విభజన జరగడం చూశామని, అయితే జమ్మూకశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజన కావడం మాత్రం చరిత్రలో మొదటిసారని ఆక్షేపించారు


Read More National News and Latest Telugu News

Also Read: Narendra Modi: యూఎస్‌లో మరో రెండు భారతీయ రాయబార కార్యాలయాలు ఏర్పాటు

Updated Date - Sep 23 , 2024 | 03:51 PM